Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​ డే!-bank of baroda recruitment 2023 registration for 250 posts ends today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​ డే!

Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​ డే!

Sharath Chitturi HT Telugu
Dec 26, 2023 06:43 AM IST

Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడా రిక్రూట్​మెంట్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో ముగియనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​!
బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​! (Reuters file photo)

Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 పోస్టుల భర్తీకి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. సీనియర్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నా వారు త్వరపడాలి. అర్హులైన అభ్యర్థులు bankofbaroda.in అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​ అప్లికేషన్​ వేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 6న ప్రారంభమైంది. డిసెంబర్ 26న (నేడు) ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బ్యాంక్​ ఆఫ్​ బరోడా రిక్రూట్​మెంట్​ 2023..

అర్హత:- 250 సీనియర్​ మేనేజర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ / ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పాసై ఉండాలి.

Bank of Baroda Recruitment 2023 apply online : వయస్సు:- అభ్యర్థుల వయస్సు 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:- తొలుత ఆన్​లైన్​ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్ లేదా అందుకు సమానమైన పరీక్ష నిర్వహిస్తారు. వాటిల్లో ఉత్తీర్ణులైన వారు.. గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇక ఆన్​లైన్​ పరీక్షలో 150 ప్రశ్నలు, గరిష్ఠంగా 225 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు ఉంటుంది.

Bank of Baroda Recruitment 2023 notification : దరఖాస్తు ఫీజు:- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించినా, చేయకపోయినా, ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయినా, కాకపోయినా అభ్యర్థి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా రిక్రూట్​మెంట్​ 2023 ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- bankofbaroda.in. లోకి వెళ్లండి.

Bank of Baroda Recruitment 2023 details : స్టెప్​ 2:- హోం పేజ్​లోకి వెళ్లి, అక్కడ కనిపించే కెరీర్స్​ లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది. BOB Senior Manager Recruitment 2023 లింక్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- రిజిస్ట్రేషన్​ వివరాలు ఎంటర్​ చేసి, సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 5:- ఇప్పుడు అకౌంట్​లోకి లాగిన్​ అవ్వంది. అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేయండి.

స్టెప్​ 6:- పేమెంట్​ని పూర్తి చేసి, సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 7:- పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకోండి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం