Bank Holidays In July : జూలై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా? ఇదిగో లిస్ట్-bank holidays list in july 2024 12 days holidays to all banks in july check list here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Holidays In July : జూలై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా? ఇదిగో లిస్ట్

Bank Holidays In July : జూలై నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా? ఇదిగో లిస్ట్

Anand Sai HT Telugu

Bank Holidays In July 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతీ నెలలొ సెలవులు ఉంటాయి. ఇందులో కొన్ని ప్రాంతీయ, మరికొన్ని జాతీయ సెలవులు వస్తాయి. ఈ ప్రకారంంగా చూసుకుంటే జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..

జూలైలో బ్యాంక్​లకు సెలవులు!

ఇది బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ముఖ్యమైన వార్త. ఎందుకంటే బ్యాంకులకు సెలవులు ఉంటే చాలా విషయాలు ఆగిపోతాయి. అందుకే బ్యాంకు సెలవుల గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. భారతదేశంలో జూలై నెలలో మొత్తం 12 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

వచ్చే నెలలో అంటే జూలై 2024లో ఎన్ని బ్యాంకులకు సెలవులు వస్తాయి, బ్యాంకు లావాదేవీలు ఎన్ని రోజులు జరుగుతాయి అనే విషయాలను కస్టమర్లు ముందుగానే తెలుసుకోవాలనుకోవడం సహజం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ముందుగానే సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. అలాగే జూలై 2024 సెలవుల జాబితా ప్రకారం, ప్రాంతీయ సెలవులతో కలిపి మొత్తం 12 సెలవులు ఉన్నాయి. ఇందులో రెండో, నాల్గో శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి.

బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో పనిచేస్తాయి. కానీ ఆదివారాలు మూసి ఉంటాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ బ్యాంక్ వెబ్‌సైట్‌లు లేదా ATMల ద్వారా లావాదేవీలు చేయడానికి కస్టమర్‌లను అనుమతిస్తాయి. మీరు జూలై నెలలో బ్యాంక్ లావాదేవీలను నిర్వహించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సెలవుల జాబితాను చూసి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

జూలై 2024 కోసం రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా

రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల వివరాలు

జూలై 3 (బుధవారం) బెహ్ దీంక్లామ్ (మేఘాలయ)

జూలై 6 (శనివారం) MHIP డే (మిజోరం)

జూలై 7 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

జూలై 8 (సోమవారం) కాంగ్ (రథజాత్ర) (మణిపూర్)

జూలై 9 (మంగళవారం) ద్రుక్పా త్షే-జీ (సిక్కిం)

జూలై 13 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

జూలై 14 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

జూలై 16 (మంగళవారం) హరేలా (ఉత్తరాఖండ్)

జూలై 17 (బుధవారం) ముహర్రం/అషురా/యు తిరోత్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర)

జూలై 21 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

జూలై 27 (శనివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

జూలై 28 (ఆదివారం) వారాంతపు సెలవు (ఆల్ ఇండియా)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ/రాష్ట్ర సెలవులు, సాంస్కృతిక లేదా మతపరమైన ఆచారాలు, కార్యాచరణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక మార్గాల విడుదల చేస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.