Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీపై వలపు వల; హత్య చేసి, చర్మం వలిచి..-bangladesh mp honey trapped killers skinned chopped body used turmeric ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bangladesh Mp: బంగ్లాదేశ్ ఎంపీపై వలపు వల; హత్య చేసి, చర్మం వలిచి..

Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీపై వలపు వల; హత్య చేసి, చర్మం వలిచి..

HT Telugu Desk HT Telugu
Published May 24, 2024 12:57 PM IST

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు సంబంధించి అనేక దారుణమైన కోణాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి వలపు వల వేసి, భారత్ కు రప్పించి, దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.అన్వరుల్ చివరిసారిగా కోల్కతాలోని ఓ ఫ్లాట్లోకి వెళ్తుండగా కనిపించాడు. ఆ ఫ్లాట్ అన్వరుల్ స్నేహితుడికి చెందినదిగా తెలుస్తోంది.

కోల్ కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్
కోల్ కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్

Bangladesh MP murder: హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అన్వరుల్ అజీమ్ అనార్ ను ఓ మహిళ ప్రలోభపెట్టి కోల్ కతాలోని న్యూ టౌన్ ఫ్లాట్ లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆపై అతడిని కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేసి ఉంటారని పశ్చిమ బెంగాల్ పోలీసులు అనుమానిస్తున్నారు.

వలపు వలతో ఫ్లాట్ లోకి..

హనీట్రాప్ కోణంతో పాటు, ఈ హత్యలో అమెరికా పౌరుడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ కు సన్నిహితుడని, ఎంపీ హత్యకు ఆ అమెరికన్ రూ.5 కోట్లు చెల్లించాడని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఫ్లాట్ ఉన్న వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అన్వరుల్ అజీమ్ అనార్ చివరిసారిగా సజీవంగా కోల్ కతాలోని ఆ అద్దె ఫ్లాట్లోకి వెళ్తుండగానే కనిపించాడు.

చంపి సూట్ కేసులో కుక్కి..

బంగ్లా ఎంపీ అన్వరుల్ స్నేహితుడికి సన్నిహితంగా ఉండే ఓ మహిళ వేసిన హనీ ట్రాప్ లో పడిపోయాడని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ‘‘ఆ వలపు వలలో పడిపోయే ఆ ఎంపీ అనార్ ను న్యూ టౌన్ ఫ్లాట్ లోకి రావాలని ఆ మహిళ ప్రలోభపెట్టినట్లు తెలుస్తోంది. ఫ్లాట్ కు వెళ్లిన వెంటనే అతడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు. ఓ పురుషుడు, మహిళతో కలిసి అన్వరుల్ ఫ్లాట్లోకి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని సీఐడీ గుర్తించింది. ఆ ఎంపీతో పాటు వచ్చిన ఇద్దరు ఆ తర్వాత ఇద్దరూ ఫ్లాట్ లోకి వచ్చి బయటకు వచ్చారు. కానీ, ఆ ఎంపీ మాత్రం మళ్లీ బయటకు రాలేదు. ‘‘సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులతో కలిసి బంగ్లాదేశ్ ఎంపీ ఫ్లాట్ లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ మరుసటి రోజు వీరిద్దరూ బయటకు వచ్చి తిరిగి ఫ్లాట్లోకి ప్రవేశించారు. అయితే ఎంపీ మాత్రం మళ్లీ కనిపించలేదు’’ అని పోలీసు అధికారులు తెలిపారు. మరుసటి రోజు వీరిద్దరూ భారీ సూట్ కేస్ తో ఫ్లాట్ నుంచి బయటకు వచ్చారు.

చర్మం వలిచి, మృతదేహాన్ని ముక్కలు చేసి..

ఫ్లాట్ లోపల రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. శరీర భాగాలను పారవేయడానికి అనేక ప్లాస్టిక్ సంచులను కూడా ఉపయోగించారు. ‘‘బంగ్లాదేశ్ ఎంపీ (Bangladesh MP) అన్వరుల్ ను తొలుత గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నాము. అనంతరం మృతదేహం చర్మ వలిచి, బాడీని పలు ముక్కలుగా నరికారు. ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశారు. అది తొందరగా కుళ్లిపోకుండా ఉండడం కోసం పసుపు పొడి కలిపారు’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. శరీర భాగాలను ట్రాలీ బ్యాగులో ఉంచి అనంతరం వేర్వేరు చోట్ల చెల్లాచెదురుగా పడేశారు. కొన్ని భాగాలను ఫ్రిజ్ లో కూడా ఉంచారు.

తప్పుదోవ పట్టించేందుకు కుటుంబ సభ్యులకు సందేశాలు

ఢిల్లీ వెళ్తున్నానని, తనను సంప్రదించవద్దని అతని ఫోన్ ద్వారానే అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులకు హంతకులు సందేశాలు పంపారు. తద్వారా వారికి అనుమానం రాకుండా ఉంటుందని భావించారు. ఇదిలావుండగా, ఎంపీ మృతదేహం చర్మం వలిచి, బాడీని ముక్కలు చేసిన ముంబైకి చెందిన జిహాద్ హవల్దార్ (24) అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ లోని ఖుల్నాకు చెందిన హవల్దార్ ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.