AYUSH NEET UG 2023: ఆయుష్ నీట్ యూజీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల; రెండు వారాల్లో కౌన్సెలింగ్ పూర్తి-ayush neet ug 2023 counselling schedule out registration begins sep 1 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Ayush Neet Ug 2023 Counselling Schedule Out, Registration Begins Sep 1

AYUSH NEET UG 2023: ఆయుష్ నీట్ యూజీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల; రెండు వారాల్లో కౌన్సెలింగ్ పూర్తి

HT Telugu Desk HT Telugu
Aug 17, 2023 01:25 PM IST

AYUSH NEET UG 2023: ఆయుష్ నీట్ యూజీ 2023 రౌండ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆయుష్ నీట్ యూజీ 2023 రౌండ్ 1 అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ లోపు ముగుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

AYUSH NEET UG 2023: ఆయుష్ నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం ఆయుష్ నీట్ యూజీ 2023 రౌండ్ 1 అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ లోపు ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, డీమ్డ్ యూనివర్సిటీల్లోని బీఏఎంఎస్ (ఆయుర్వేద), బీఎస్ఎంఎస్ (సిద్ధ), బీయూఎంఎస్ (యునానీ), బీహెచ్ఎంఎస్ (హోమియోపతి) (BAMS/BSMS/BUMS/BHMS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం aaccc.gov.in. వెబ్ సైట్ ను చూడండి.

ట్రెండింగ్ వార్తలు

రౌండ్ 1 కౌన్సెలింగ్

ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ (AACCC) ఈ ఆయుష్ నీట్ యూజీ 2023 షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై, సెప్టెంబర్ 4 వ తేదీన ముగుస్తుంది. కాలేజీ కోర్స్ చాయిస్ ల ఎంపిక, లాకింగ్ ఫెసిలిటీ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థుల జాబితా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలవుతుంది. విద్యార్థులు తమకు ఎలాటైన కాలేజీలో సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 13 మధ్య రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

మొత్తం 4 రౌండ్లుగా కౌన్సెలింగ్

ఇది ఇది రౌండ్ వన్ కౌన్సెలింగ్. దీని తర్వాత రౌండ్ 2, రౌండ్ 3 కౌన్సెలింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ తరువాత వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉంటుంది. మొదటి మూడు రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్లైన్లో జరుగుతుంది. మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత వేకెన్సీ వివరాలు, అర్హులైన విద్యార్థుల వివరాలను సంబంధిత డీమ్డ్ యూనివర్సిటీలకి నవంబర్ 6వ తేదీన పంపిస్తారు. ఆయా యూనివర్సిటీలు వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ ని నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియని ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ (AACCC) నిర్వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, డీమ్డ్ యూనివర్సిటీల్లోని బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ (BAMS/BSMS/BUMS/BHMS) కోర్సుల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఎస్, ఎండీ (MD/MS) కోర్సుల్లో ప్రవేశాలకు AACCC కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

WhatsApp channel