AYUSH NEET PG 2023: ఆయుష్ నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల; రిజిస్ట్రేషన్ కు సిద్ధం కండి..
AYUSH NEET PG 2023: ఆయుష్ నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఆయుష్ నీట్ పీజీ పరీక్ష రాసిన విద్యార్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
AYUSH NEET PG 2023 Counselling: ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో పతి కోర్సుల్లొ పీజీ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. ఆయుష్ నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన విద్యార్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విద్యార్థులు aaccc.gov.in. వెబ్ సైట్ ను సందర్శించాలి.
ట్రెండింగ్ వార్తలు
రిజిస్ట్రేషన్..
ఆయుష్ నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన విద్యార్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి aaccc.gov.in. వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 2 వ తేదీ. అక్టోబర్ 3, అక్టోబర్ 4 తేదీల్లో సీట్స్ అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది. ఏ విద్యార్థికి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో అక్టోబర్ 5వ తేదీన ప్రకటిస్తారు. అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 13 తేదీ మధ్య విద్యార్థులు తమకు అలాట్ చేసిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయుష్ నీట్ పీజీ 2023 అడ్మిషన్లకు మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ జరుగుతుంది. మూడు రౌండ్ల కౌన్సెలింగ్ అనంతరం, మిగిలిన సీట్లకు స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ ఉంటుంది.
ఇలా రిజిస్టర్ చేసుకోండి..
ఆయుష్ నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- ముందుగా ఆయుష్ అధికారిక వెబ్ సైట్ అయిన aaccc.gov.in. కు వెళ్లాలి.
- హోం పేజీపై కనిపించే Ayush NEET PG registration లింక్ పై క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ వివరాలతో లాగిన్ కావాలి.
- స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్ర పర్చుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ఒక ప్రింట్ తీసి పెట్టుకోవాలి.