Triple talaq: ప్రధాని మోదీ, సీఎం యోగిని పొగిడిన భార్యకు ట్రిపుల్ తలాక్ తో విడాకులిచ్చిన భర్త-ayodhya resident gives triple talaq to wife after she praises pm modi cm yogi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Triple Talaq: ప్రధాని మోదీ, సీఎం యోగిని పొగిడిన భార్యకు ట్రిపుల్ తలాక్ తో విడాకులిచ్చిన భర్త

Triple talaq: ప్రధాని మోదీ, సీఎం యోగిని పొగిడిన భార్యకు ట్రిపుల్ తలాక్ తో విడాకులిచ్చిన భర్త

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 02:42 PM IST

PM Modi: అయోధ్య నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దారని ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను ప్రశంసించిన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. అంతేకాదు, ఆమెను బూతులు తిడుతూ, వేడి వేడి పప్పు ఆమెపై కుమ్మరించాడు. అతడికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

ప్రధాని మోదీ, సీఎం యోగిని పొగిడిన భార్యకు ట్రిపుల్ తలాక్ తో విడాకులిచ్చిన భర్త
ప్రధాని మోదీ, సీఎం యోగిని పొగిడిన భార్యకు ట్రిపుల్ తలాక్ తో విడాకులిచ్చిన భర్త (Image for representation.)

PM Modi: అయోధ్య నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ప్రశంసించినందుకు తన భార్యకు ఒక వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెపై హత్యాయత్నం చేశాడు. దీనిపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో, ఆ వ్యక్తిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అర్షద్ తో పాటు ఏడుగురు కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చారు.

మోదీని, యోగిని ప్రశంసిస్తావా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యకు చెందిన అర్షద్ బహ్రైచ్ కు చెందిన మరియం అనే యువతిని ఇస్లాం సాంప్రదాయం ప్రకారం 2023 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె తన అత్తగారింటికి అయోధ్య వచ్చింది. ఒక సందర్భంలో అయోధ్యను సుందరంగా తీర్చి దిద్దారని ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను ఆమె ప్రశంసించింది. దాంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన అర్షద్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఆ తరువాత పెద్ద మనుషులు జోక్యం చేసుకుని, తిరిగి ఆమెను అయోధ్యకు పంపించారు.

ట్రిపుల్ తలాక్

కానీ, అయోధ్యకు తిరిగి వచ్చిన రోజే తన భార్యపై అర్షద్ మరోసారి చేయి చేసుకున్నాడు. కోపంగా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అంతేకాదు, ఆమెపై వేడివేడి పప్పు కుమ్మరించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అనంతరం మరియం పోలీసులను ఆశ్రయించి, భర్త, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్షద్ తో పాటు అతడి కుటుంబ సభ్యులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై దాడి, వేధింపులు, బెదిరింపులు, వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆ యువతి వీడియో వైరల్

తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రువర్గాల అంగీకారంతో, తన శక్తికి మించి ఖర్చు చేసి తన తండ్రి తనకు పెళ్లి చేశారని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘పెళ్లి తర్వాత నగరానికి వెళ్లినప్పుడు అయోధ్య (ayodhya) ధామ్ రోడ్లు, సుందరీకరణ, అక్కడి అభివృద్ధి, వాతావరణం నాకు బాగా నచ్చాయి. ఈ సందర్భంగా నా భర్త ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని ప్రశంసించాను. దీంతో అర్షద్ కు కోపం వచ్చింది. నన్ను తిట్టి, పుట్టింటికి పంపించాడు’’ అని ఆ యువతి ఆ వీడియోలో వివరించింది.

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం

ట్రిపుల్ తలాక్ (triple talaq) విధానం రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడుసార్ల తలాఖ్ అని ఉచ్ఛరించడ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే విధానాన్నే ట్రిపుల్ తలాక్ అంటారు.