ఒక దిల్లీ ఆటో డ్రైవర్ నెలకు రూ .5–8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది ఐటీ ఉద్యోగులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా సాధించడానికి కష్టపడే ఫిగర్! అది కూడా తన ఆటోను నడపకుండానే అని చెబితే మీరు నమ్మగలరా? ఈ ఆటో డ్రైవర్ ఎలాంటి ఫండింగ్, యాప్, ఫ్యాన్సీ టెక్నాలజీ లేకుండానే ఒక అద్భుతమైన ఆలోచనతో ఇదంతా సాధిస్తున్నాడు. యూఎస్ కాన్సులేట్ బయట ఉండే ఈయన.. అపాయిట్మెంట్ల కోసం లోపలికి వెళ్లే వారి లగేజ్‌ని తన వాహనంలో ఉంచుకోవడం ద్వారా ఇంత డబ్బును సంపాదిస్తున్నాడట. ఈ విషయాన్ని లెన్స్‌కార్ట్ ప్రొడక్ట్ లీడర్, అనుభవజ్ఞుడైన పారిశ్రామికవేత్త రాహుల్ రూపానీ ఈ లింక్డ్ఇన్లో తెలిపారు.
వీసా అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నప్పుడు రూపానీ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
"నేను నా బ్యాగును లోపలికి తీసుకెళ్లలేనని సెక్యూరిటీ నాకు చెప్పారు. లాకర్లు లేదా ప్రత్యామ్నాయాలు కూడా లేవు. అయితే, ఫుట్‌పాత్ మీద నిల్చొని ఒక ఆటో డ్రైవర్ ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పాడు: “సార్, బ్యాగ్ దే దో. సేఫ్ రఖుంగా, మేరా రోజ్ కా హై. రూ.1,000 ఛార్జీ. (సర్, మీ బ్యాగ్ నాకు ఇవ్వండి. దాన్ని భద్రంగా ఉంచుతాను. నా రోజువారీ రేటు రూ. 1,000)” అని రూపానీ తెలిపారు.
“స్ట్రీట్-స్మార్ట్ వ్యాపారంలో ఒక విషయం బయటపడింది: డ్రైవర్ ప్రతిరోజూ కాన్సులేట్ వెలుపల ఆటోను పార్క్ చేసి, ప్రతి కస్టమర్‌కు రూ .1,000 చొప్పున బ్యాగ్ కీపింగ్ సర్వీస్‌ని అందిస్తున్నాడు. రోజుకు 20 నుంచి 30 మంది కస్టమర్లు వస్తున్నారు. ఇలా డ్రైవర్ ఆటో కూడా నడపకుండానే రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నాడు. నెలకు అది రూ. 5లక్షల నుంచి రూ. 8లక్షల వరకు ఉంటుంది,” అని రూపానీ పేర్కొన్నారు.
“ఆ డ్రైవర్.. తన ఆటోలో చట్టబద్ధంగా 30 బ్యాగులు ఉంచలేడని, అందుకే సమీపంలోని ఓ పోలీస్తో అతను డీల్ చేసుకున్నాడు. బ్యాగులు ఆ లాకర్ స్పేస్ దగ్గరికి వెళతాయి,” రూపానీ వివరించారు.
అంటే బ్యాగులు ఆటోలో కూడా ఉండవు!
"హైపర్-స్పెసిఫిక్ పెయిన్ పాయింట్‌ని పరిష్కరించడంలో ఇది ఒక మాస్టర్‌క్లాస్," అని పేర్కొన్న రూపానీ.. సాంకేతికత లేకుండా నమ్మకాన్ని పెంపొందించడం, చట్టబద్ధమైన పరిష్కారాన్ని సృష్టించడం, తక్షణ మనశ్శాంతి కోసం ప్రీమియం వసూలు చేసే డ్రైవర్ సామర్థ్యాన్ని ప్రశంసించాలన్నారు. "ఎంబీఏ లేదు. స్టార్టప్ పదజాలం లేదు. జెస్ట్ ప్యూర్ హసిల్ మాత్రమే,' అని పేర్కొన్నారు.
బిజినెస్ బుక్స్‌లో చదవని ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ముందుగా ఆలోచించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. “నిజమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఎల్లప్పుడూ పిచ్ డెక్ అవసరం లేదు. కొన్నిసార్లు దీనికి పార్కింగ్ స్పాట్ చాలు,” అని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం