Shooting at Michigan versity: మిషిగన్ యూనివర్సిటీలో కాల్పులు-at least 3 dead 5 injured in shooting at michigan state university campus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shooting At Michigan Versity: మిషిగన్ యూనివర్సిటీలో కాల్పులు

Shooting at Michigan versity: మిషిగన్ యూనివర్సిటీలో కాల్పులు

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:23 PM IST

Shooting at Michigan versity: అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకీ పెచ్చుమీరిపోతోంది. ప్రతీరోజు ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు యూఎస్ లో సాధారణమయ్యాయి. తాజాగా, మిషిగన్ స్టేట్ వర్సిటీ (Michigan State University) క్యాంపస్ లోనూ కాల్పులు జరిగాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Representational)

Shooting at Michigan versity: ఈస్ట్ లాన్సింగ్ (East Lansing campus) లోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) క్యాంపస్ లో మంగళవారం ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయాల పాలయ్యారు. క్యాంపస్ లో కాల్పుల ఘటనలో విద్యార్థులు, ఫాకల్టీ భయాందోళనలకు గురవుతున్నారు.

Shooting at Michigan versity: ముగ్గురు మృతి

మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) మెయిన్ క్యాంపస్ లోని రెండు చోట్ల ఆ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. రెండు చోట్ల కూడా కాల్పులకు పాల్పడింది ఒక్కడేనని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. మొదట బర్క్ లీ హాల్ (Berkey Hall) అనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరలో కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా,ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత, అక్కడి నుంచి వెళ్లి ఐఎం ఈస్ట్ (IM East) అనే అథ్లెటిక్ సెంటర్ వద్ద కాల్పులు జరిపారు. అక్కడ జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, వర్సిటీలో ఆ దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ దుండగుడు క్యాంపస్ లోనే దాక్కుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య అయి ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. అయితే, మృతులు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు కానీ, వర్సిటీ అధికారులు కానీ వెల్లడించలేదు. అమెరికాలోని ప్రముఖ వర్సిటీల్లో మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ఒకటి. ఆ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ ఈస్ట్ ల్యాన్సింగ్ (East Lansing campus) లోనే ఉంటుంది. ఈ క్యాంపస్ లో దేశ విదేశాలకు చెందిన అండర్ గ్యాడ్యుయేట్, పీజీ విద్యార్థులు సుమారు 50 వేల మంది వరకు ఉంటారు. ఇక్కడ భారతీయ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.

Whats_app_banner