Hindu students injured:హోలీ ఉత్సవాలను అడ్డుకుని, హిందూ విద్యార్థులపై దాడి చేసి..-at least 15 hindu students injured in clash over holi celebration in pakistan university ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  At Least 15 Hindu Students Injured In Clash Over Holi Celebration In Pakistan University

Hindu students injured:హోలీ ఉత్సవాలను అడ్డుకుని, హిందూ విద్యార్థులపై దాడి చేసి..

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 06:56 PM IST

Hindu students injured: పాకిస్తాన్ లో హిందూ విద్యార్థులపై దాడి జరిగింది. హోలీ ఉత్సవాల కోసం గుమికూడిన మైనారిటీ హిందూ విద్యార్థులపై ఇస్లామిస్ట్ గ్రూప్ విద్యార్థులు దాడి చేశారు.

పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీ వద్ద అప్రమత్తంగా ఉన్న గార్డులు
పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీ వద్ద అప్రమత్తంగా ఉన్న గార్డులు (AP/Representational image)

Hindu students injured: పాకిస్తాన్ లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో హిందూ విద్యార్థులపై రాడికల్ ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ‘ఇస్లామీ జమాయిత్ తుల్బా (Islami Jamiat Tulba IJT)’ సభ్యులు దాడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Hindu students injured: హోలీ పండుగ జరుపుకోవద్దని..

పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీ ప్రాంగణంలో హోలీ ఉత్సవాలను జరుపుకునే ఉద్దేశంతో సుమారు 30 మంది హిందూ విద్యార్థులు గుమి కూడారు. అయితే, వారిని రాడికల్ ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు హోలీ పండుగ జరుపుకోకుండా అడ్డుకున్నారు. హోలీ పండుగ జరుపుకునేందుకు వెళ్లిన హిందూ విద్యార్థులను ఇస్లామీ జమాయిత్ తుల్బా (Islami Jamiat Tulba IJT) విద్యార్థులు అడ్డుకున్నారు. హిందూ విద్యార్థులపై దాడికి దిగారు. వారి దాడిలో 15 మంది వరకు హిందూ విద్యార్థులు గాయపడ్డారు. హోలీ జరుపుకునేందుకు కాలేజీ యాజమాన్యం నుంచి ముందే అనుమతి కూడా తీసుకున్నామని హిందూ విద్యార్థులు తెలిపారు. ఆ తరువాత, ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వైస్ చాన్సెలర్ ఆఫీస్ వెళ్లిన హిందూ విద్యార్థులపై అక్కడి గార్డులు కూడా దాడి చేశారు. వీసీ ఆఫీస్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై అక్కడి గార్డులు చేయి చేసుకున్నారని బాధిత విద్యార్థి ఖేత్ కుమార్ తెలిపారు. ఈ రెండు ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆరోపించారు.

Hindu students injured: అనుమతి లేదు..

అయితే, హోలీ జరుపుకునే విద్యార్థులపై జరిగిన దాడిలో తమ విద్యార్థుల ప్రమేయం లేదని ఇస్లామీ జమాయిత్ తుల్బా (Islami Jamiat Tulba IJT) పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఇబ్రహీం షాహిద్ తెలిపారు. ఆ సమయంలో లా కాలేజీలో IJT తరఫున ఖురాన్ పఠనం కార్యక్రమం నిర్వహించామన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో హోలీ జరుపుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వలేదని పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఖుర్రం షాజహాద్ స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్