crime news: `కూతురి బాయ్‌ఫ్రెండ్ చెవులు కోసేశాడు`-assam man chops off daughter s boyfriend s ears ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Assam Man Chops Off Daughter's Boyfriend's Ears

crime news: `కూతురి బాయ్‌ఫ్రెండ్ చెవులు కోసేశాడు`

HT Telugu Desk HT Telugu
Jul 19, 2022 10:56 PM IST

crime news: ఒక తండ్రి త‌న మైన‌ర్ కూతురితో స‌న్నిహితంగా ఉంటున్న బాలుడి చెవులు కోసేసిన ఘ‌ట‌న అస్సాంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఘ‌ట‌న జ‌రిగిన గ్రామంలో పోలీసులు
ఘ‌ట‌న జ‌రిగిన గ్రామంలో పోలీసులు

crime news: త‌న టీనేజ్ కూతురుతో ఒక బాలుడు స‌న్నిహితంగా ఉండడం చూసిన ఒక తండ్రి ప‌ట్ట‌రాని కోపంతో ఆ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌ర్చాడు. ఆ త‌రువాత ఆ బాలుడిని స్తంభానికి క‌ట్టేసి చెవులు కోసేశాడు.

ట్రెండింగ్ వార్తలు

crime news: టీనేజ్ బాలిక‌తో..

అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని సిమ‌లుగురి గ్రామంలో సోమ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక వ్య‌క్తి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో త‌న టీనేజ్ కూతురు ఒక 10వ త‌ర‌గ‌తి అబ్బాయితో స‌న్నిహితంగా ఉండ‌డం చూశాడు. ప‌ట్ట‌రాని కోపంతో ఆ బాలుడిపై దాడి చేశాడు. విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టాడు. త‌రువాత స్తంభానికి క‌ట్టివేసి, ఆ బాలుడి చెవులు కోసివేశాడు. ఆ త‌రువాత‌, ఆ బాలుడిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

crime news: పోలీసుల అదుపులో నిందితుడు

ఆ త‌రువాత తానే పోలీసుల‌కు ఫోన్ చేసి, త‌న ఇంట్లో దొంగ‌త‌నం చేస్తుండ‌గా ఒక బాలుడిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ట్లు చెప్పాడు. పోలీసులు ఆ బాలుడిని విచారిస్తున్న స‌మ‌యంలో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌రువాత‌ ఈ ఘ‌ట‌న‌పై బాధిత బాలుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన‌ ఆ బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డిపై ఐపీసీ సెక్ష‌న్ 326 కింద కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం గ్రామంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. నిందితుడి ఇంటిపై దాడికి బాధిత బాలుడి బంధువులు ప్ర‌య‌త్నించారు.

WhatsApp channel