Junmoni Rabha: రోడ్డు ప్రమాదంలో అస్సాం వివాదాస్పద పోలీస్, ‘లేడీ సింగం’ రభా మృతి-assam controversial police lady singam junmoni rabha killed in accident ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Assam Controversial Police Lady Singam Junmoni Rabha Killed In Accident

Junmoni Rabha: రోడ్డు ప్రమాదంలో అస్సాం వివాదాస్పద పోలీస్, ‘లేడీ సింగం’ రభా మృతి

Chatakonda Krishna Prakash HT Telugu
May 17, 2023 06:50 AM IST

Junmoni Rabha: లేడీ సింగంగా ఫేమస్ అయిన అస్సాం పోలీసు అధికారికి జుర్మనీ రభా.. ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వివరాలివే.

Junmoni Rabha: రోడ్డు ప్రమాదంలో అస్సాం వివాదాస్పద పోలీస్, ‘లేడీ సింగం’ రభా మృతి (ఫైల్ ఫొటో) (Photo: Twitter)
Junmoni Rabha: రోడ్డు ప్రమాదంలో అస్సాం వివాదాస్పద పోలీస్, ‘లేడీ సింగం’ రభా మృతి (ఫైల్ ఫొటో) (Photo: Twitter)

Junmoni Rabha: తన పని తీరుతో పాటు పలు వివాదాల్లో చిక్కుకొని దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అస్సాం (Assam) మహిళా సబ్ ఇన్‍‍స్పెక్టర్ జున్మోనీ రభా (Junmoni Rabha) మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న కారును నాగాన్ (Nagaon) జిల్లాలో ఓ కంటైనర్ ట్రక్కు ఢీకొట్టిందని అధికారులు వెల్లడించారు. దీంతో కారులో ఉన్న రభా తీవ్రగాయాలపాలై మృతి చెందారని పేర్కొన్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Junmoni Rabha: విధుల్లో కఠినమైన వైఖరితో లేడి సింగం, దబాంగ్ కాప్ పేర్లతో జున్మోనీ రభా ఫేమస్ అయ్యారు. ఆమె యూనిఫాం లేకుండా ఒంటరిగా మంగళవారం ప్రయాణిస్తుండగా.. నాలాన్ జిల్లాలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభూగియా గ్రామం సమీపంలో ఆమె కారును ఓ కంటైనర్ ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందే ఆమెపై ఓ దోపీడీ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని కూడా సీఐడీనే దర్యాప్తు చేస్తోంది.

Junmoni Rabha: “అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో మాకు సమాచారం వచ్చింది. మేం సంఘటన స్థలానికి వెళ్లాం. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించాం. అయితే అప్పటికే ఆమె చనిపోయారని పోలీసులు ధ్రువీకరించారు” అని జఖలబంధ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‍చార్జ్ పవన్ కలీతా పేర్కొన్నారు. కారును ఢీకొన్న ట్రక్ ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

ఇది హత్యే: రభా తల్లి ఆరోపణ

Junmoni Rabha: జున్మోనీ రభా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ విషయంపై పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపి, నిజాన్ని బయటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇది ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జున్మోనీ తల్లి సుమిత్ర రభా.. మీడియాతో అన్నారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించారని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కోరారు జున్మోనీ బంధువు సువర్ణ. సోమవారం జరిపిన సోదాల్లో జర్మోనీ అధికారి క్వార్టర్‌లో రూ.1లక్షను అధికారులు సీజ్ చేశారని, ఆ డబ్బు ఆమె తల్లిది అని ఆమె తెలిపారు.

Junmoni Rabha: అస్సాంలోని మోరీకోలోంగ్ పోలీస్ ఔట్‍పోస్టుకు ఇన్‍-చార్జ్‌గా సబ్‍ ఇన్‍స్పెక్టర్ జున్మోనీ రభా ఉండేవారు. పని తీరులో ఆమె చాలా కఠినంగా వ్యవహరించే వారు. అయితే, గతేడాది జూన్‍లో ఓ అవినీతి కేసులో చిక్కుకున్నారు. రిమాండ్‍ను సైతం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ తొలగిపోవటంతో తిరిగి విధుల్లో చేరారు. అంతకు ముందు 2022 జనవరిలో బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‍తో జున్మోనీ రభా చేసి సంభాషణ వివాదాస్పదమైంది. అక్రమంగా నాటు బోట్లకు మిషన్లను అమర్చిన కొందరిని అప్పట్లో ఆమె అరెస్టు చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రశ్నించటంతో.. ఆమె దూకుడుగా మాట్లాడిన ఆడియో రికార్డింగ్ బయటికి వచ్చింది. ఈ విషయంపై అప్పట్లో సీఎం బిశ్వ శర్మ కూడా స్పందించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని అన్నారు.

WhatsApp channel