Ashok Gehlot : కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసు నుంచి అశోక్​ గహ్లోత్​ ఔట్​!-ashok gehlot out of congress president race after rajasthan mlas rebellion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ashok Gehlot Out Of Congress President Race After Rajasthan Mlas' Rebellion

Ashok Gehlot : కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసు నుంచి అశోక్​ గహ్లోత్​ ఔట్​!

Sharath Chitturi HT Telugu
Sep 27, 2022 08:42 AM IST

Ashok Gehlot out of Congress president race : కాంగ్రెస్​ అధ్యక్ష పదవి నుంచి అశోక్​ గహ్లోత్​ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన నామినేషన్​ వేయాల్సి ఉంది.

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసు నుంచి అశోక్​ గహ్లోత్​ ఔట్​!
కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసు నుంచి అశోక్​ గహ్లోత్​ ఔట్​! (PTI)

Ashok Gehlot out of Congress president race : కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసు నుంచి రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ తప్పుకున్నట్టు తెలుస్తోంది. 90మంది రాజస్థాన్​ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంతో గాంధీ కుటుంబం అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అశోక్​ గహ్లోత్​ తప్పుకోవడంతో.. కాంగ్రెస్​ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్​కు పోటీగా మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్​ సింగ్​లు నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం..

Rajasthan Congress crisis : వచ్చే నెలలో కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. ఇందులో పోటీ చేసేందుకు గహ్లోత్​ ఆసక్తి చూపించారు. ఆయన గాంధీల విధేయుడని అందరికి తెలిసిన విషయమే. ఫలితంగా.. ఆయనకు గాంధీ కుటుంబం నుంచి మద్దతు ఉంటుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. కాంగ్రెస్​ అధ్యక్ష పదవి చేపడితే.. సీఎం పదవి వదులుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్​ అధిష్ఠానం చెప్పినట్టు సమాచారం. గహ్లోత్​కు ఇది నచ్చలేదు! ఆయన మద్దతుదారులు రాజస్థాన్​లో తిరుగుబాటు చేశారు. ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది. అయితే.. మద్దతుదారులను గహ్లోత్​ రెచ్చిగొట్టినట్టు కాంగ్రెస్​ హైకమాండ్​ భావిస్తోందని తెలుస్తోంది. అందుకోసమే గహ్లోత్​పై ఆగ్రహంతో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Ashok Gehlot Sachin Pilot : రాజస్థాన్​లో సచిన్​ పైలట్​, గహ్లోత్​కు కొన్నేళ్లుగా విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే సచిన్​ పైలట్​ సీఎం అవుతారని గహ్లోత్​ భావించినట్టు తెలుస్తోంది. తొలుత.. రాజీనామాకు ఒప్పుకున్న గహ్లోత్​.. మళ్లీ మాట మార్చారు! ఫలితంగా రాజస్థాన్​ సంక్షోభం మరింత ముదిరింది.

వాస్తవానికి కాంగ్రెస్​ అధ్యక్ష పదవి కోసం అశోక్​ గహ్లోత్​ ఈరోజు నామినేషన్​ వేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు మొత్తానికే ఆయన రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం