Kejriwal ki Guarantee : ‘ఉచిత విద్యుత్​.. ఉచిత విద్య’- ప్రజలపై కేజ్రీవాల్​ హామీల వర్షం!-arvind kejriwal makes 10 poll guarantees for 2024 lok sabha elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kejriwal Ki Guarantee : ‘ఉచిత విద్యుత్​.. ఉచిత విద్య’- ప్రజలపై కేజ్రీవాల్​ హామీల వర్షం!

Kejriwal ki Guarantee : ‘ఉచిత విద్యుత్​.. ఉచిత విద్య’- ప్రజలపై కేజ్రీవాల్​ హామీల వర్షం!

Sharath Chitturi HT Telugu
May 12, 2024 02:30 PM IST

Kejriwal ki Guarantee : అరవింద్ కేజ్రీవాల్.. 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ' పేరుతో 2024 లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. భారతదేశంలోని అందరికీ ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆప్​ నేతలు..
మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆప్​ నేతలు.. (HT Photo/Sanjeev Verma)

Arvind Kejriwal 2024 Lok Sabha elections : దిల్లీ లిక్కర్​ స్కామ్​లో జైలుకు వెళ్లి బెయిల్​పై విడుదలైన ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​.. మంచి జోరు మీద ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్న ఆయన.. తాజాగా, 2024 లోక్​సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీకి ధీటుగా.. ‘కేజ్రీవాల్​ కీ గ్యారంటీ’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో.. ప్రజలపై హామీల వర్షాన్ని కురిపించారు.

ఈ హామీలు నవ భారతానికి విజన్ అని.. అవి లేకుండా దేశం శక్తిమంతంగా మారదని కేజ్రీవాల్ అన్నారు.

కేజ్రీవాల్ 10 హామీలు..

1. 24 గంటల విద్యుత్ సరఫరా: తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ను అందిస్తుంది.

2. విద్యా సంస్కరణలు: దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్యను అందిస్తూ, నాణ్యతలో ప్రైవేటు సంస్థలను అధిగమించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాము.

3. హెల్త్ కేర్ ఇంప్రూవ్​మెంట్: ప్రతి గ్రామం, ప్రాంతంలో మొహల్లా క్లినిక్​లను ఏర్పాటు చేస్తాము. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలుగా అప్​గ్రేడ్ చేస్తాము.

4. జాతీయ భద్రత: చైనా ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి, ప్రాదేశిక సమగ్రత కోసం దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించడానికి సైన్యానికి పూర్తి స్వయంప్రతిపత్తిని కల్పిస్తాము.

2024 Lok Sabha elections Delhi : 5. అగ్నివీర్ స్కీమ్ నిలిపివేత: అగ్నివీర్ పథకాన్ని నిలిపివేసి, నమోదైన పిల్లలందరినీ శాశ్వత పదవుల్లో క్రమబద్ధీకరిస్తాము. ఒప్పంద వ్యవస్థను రద్దు చేస్తాము. సైన్యానికి తగినన్ని నిధులు వచ్చేలా చూస్తాము.

6. రైతు సంక్షేమం: స్వామినాథన్ నివేదిక ఆధారంగా పంటలకు న్యాయమైన పరిహారం అందించి రైతులు గౌరవప్రదమైన జీవనం సాగించేలా చూస్తాము.

7. దిల్లీకి రాష్ట్ర హోదా: తమ ప్రభుత్వం దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తుందు, ఇది నగరవాసుల చిరకాల కోరిక అని కేజ్రీవాల్​ ఆయన అన్నారు.

8. ఉపాధి కల్పన: నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఇండియా కూటమి ప్రభుత్వం.. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.

9. అవినీతి నిర్మూలన: బీజేపీ రక్షణాత్మక చర్యలను తొలగించి, అందరికీ జవాబుదారీతనాన్ని కల్పించడం ద్వారా అవినీతిని రూపుమాపుతాము.

10. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రమోషన్: పీఎంఎల్ఏ నిబంధనల నుంచి జీఎస్టీని తొలగిస్తాము. తయారీ రంగంలో చైనాను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

ప్రజల చూపు ఎటువైపు..?

2024 Lok Sabha elections : దిల్లీ ప్రజలను అంచనా వేయడం చాలా కష్టం! అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీని భారీ మెజారిటీతో గెలిపించే దిల్లీ ఓటర్లు.. కేంద్రం విషయానికి వచ్చేసరికి, లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లను బీజేపీ క్లీన్​ స్వీప్​ చేసింది.

2024 లోక్​సభ ఎన్నికల్లో భాగంగా.. మే 25న దిల్లీలో పోలింగ్​ జరగనుంది. జూన్​ 4 ఫలితాలు వెలువడతాయి. మరి కేజ్రీవాల్​ కీ గ్యారంటీలను ప్రజలు ఆమోదించారో లేదో ఫలితాల ద్వారా తెలిసిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం