Telugu News  /  National International  /  Army Helicopter Crashes In Arunachal, 1 Pilot Dead
చీతా హెలీకాప్టర్
చీతా హెలీకాప్టర్

Army helicopter ‘Cheetah’ crashes: కూలిన చాపర్; పైలట్ మృతి

05 October 2022, 15:37 ISTHT Telugu Desk
05 October 2022, 15:37 IST

Army helicopter ‘Cheetah’ crashes: ఆర్మీ హెలీకాప్టర్ కూలిన ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో జరిగింది.

Army helicopter ‘Cheetah’ crashes: భారతీయ సైన్యానికి చెందిన ఒక హెలీకాప్టర్ బుధవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో చాపర్ పైలట్ మృతి చెందాడు.

ట్రెండింగ్ వార్తలు

Army helicopter ‘Cheetah’ crashes: చీతా..

ఆర్మీ హెలీకాప్టర్ ‘చీతా’ సాధారణ విధుల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లోని దేశ సరిహద్దుల్లోకి వెళ్లింది. ఆ చాపర్లో ఇద్దరు పైలట్ లు ఉన్నారు. తవాంగ్ ప్రాంతంలోకి వెళ్లిన తరువాత ఆ చాపర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు పైలట్ లెఫ్ట్ నెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ మరణించారు. మరో పైలట్ కు చికిత్స అందిస్తున్నారు.

Army helicopter ‘Cheetah’ crashes: కారణాలు తెలియలేదు..

ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై ఇంకా స్పష్టత లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించాయి. చీతా హెలీకాప్టర్లను దాదాపు 60 ఏళ్ల క్రితం సాయుధ దళాల్లో ప్రవేశపెట్టారు.