Rahul Gandhi on surgical strikes comment row: ‘‘సాయుధ దళాలకు ఆ అవసరం లేదు’’-armed forces need not show proof rahul gandhi on surgical strikes comment row ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'Armed Forces Need Not Show Proof': Rahul Gandhi On Surgical Strikes Comment Row

Rahul Gandhi on surgical strikes comment row: ‘‘సాయుధ దళాలకు ఆ అవసరం లేదు’’

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 05:33 PM IST

Rahul Gandhi on surgical strikes comment row: భారత్ జోడో యాత్ర తుది అంకంలో దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ తో వివాదం తలెత్తింది. సర్జికల్ స్ట్రైక్స్ పై, పుల్వామా దాడి పై బీజేపీని, కేంద్రాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి.

జమ్మూలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
జమ్మూలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ (HT_PRINT)

Rahul Gandhi on surgical strikes comment row: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర Bharat Jodo Yatra తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం జమ్మూలో కొనసాగుతున్న యాత్రలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ 2016లో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ (surgical strikes) గురించి, 2019లో జరిగిన పుల్వామా (Pulwama) దాడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ విమర్శలపై బీజేపీ (BJP) ఘాటుగా స్పందించింది. భారత సైనిక దళాలను గౌరవించే సంప్రదాయం, వారి శక్తి సామర్ధ్యాలను కొనియాడే సంప్రదాయం కాంగ్రెస్ కు లేదని విమర్శించింది.

ట్రెండింగ్ వార్తలు

Rahul Gandhi on surgical strikes comment row: సాయుధ దళాలకు ఆ అవసరం లేదు

దిగ్విజయ్ వ్యాఖ్యలు, బీజేపీ విమర్శలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ, దిగ్విజయ్ వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అవి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలుగా పరిగణించకూడదని, అవి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని వివరణ ఇచ్చారు. భారత సాయుధ దళాలు ఎవరికీ రుజువులు చూపాల్సిన అవసరం లేదన్నారు. ‘‘భారతీయ సాయుధ దళాలపై పూర్తి విశ్వాసం ఉంది. వారు అత్యుత్తమ శక్తి సామర్ద్యాలతో పని చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశాం’’ అని వివరించారు. దిగ్విజయ్ సింగ్ చాలా హాస్యాస్పదంగా మాట్లాడారని విమర్శించారు. ‘దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేత అలా

అయితే, బీజేపీ అబద్ధాలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు.

Disciplinary action on Digvijay Singh?: దిగ్విజయ్ పై చర్యలు?

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో పాల్గొనేందుకు జమ్మూ వచ్చిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. జమ్మూలో మంగళవారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్న ప్రెస్ మీట్ లో కనిపించక పోవడం గమనార్హం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) స్ఫూర్తిని దెబ్బతీశారని పలువురు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై కాంగ్రెస్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, దేశ సైనిక బలగాలపై తనకు అపార గౌరవం ఉందని దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చారు.

IPL_Entry_Point