Karnataka: ‘‘గృహ లక్ష్మి’ స్కీమ్ కు వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు’’
Karnataka: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి ‘గృహ లక్ష్మి’ ఒకటి. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తోంది.
Karnataka: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి ‘గృహ లక్ష్మి’ ఒకటి. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ‘గృహ లక్ష్మి’ పథకం కోసం ప్రజలు వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
వాట్సాప్ చాట్ బాట్..
‘గృహ లక్ష్మి’ పథకం అమలు కోసం కర్నాటక ప్రభుత్వం వాట్సాప్ చాట్ బాట్ ను రూపొందించింది. కర్నాటక వన్, బెంగళూరు వన్ కేంద్రాల్లో ఇప్పటివరకు దరఖాస్తులను స్వీకరించారు. ఇకపై వాట్సాప్ చాట్ బాట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా 8147500500 వాట్సాప్ నంబర్ ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్ తో చాట్ బాట్ అనుసంధానమై ఉంటుంది. దరఖాస్తు దారులు తమ వివరాలను ఈ నంబర్ కు పంపిస్తే, ఆ వివరాలతో అప్లికేషన్ ను ఫిల్ చేయడానికి ఈ చాట్ బాట్ సహాయ పడ్తుంది. దరఖాస్తును నింపిన తరువాత దాన్ని నేరుగా బెంగళూరు వన్ కేంద్రానికి కానీ, కర్నాటక వన్ కేంద్రానికి కానీ, గ్రామ వన్ కేంద్రానికి కానీ పంపిస్తుంది. ఇప్పటివరకు ఇలా వాట్సాప్ చాట్ బాట్ ద్వారా 7 లక్షల దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
‘గృహ లక్ష్మి’ పథకం వివరాలు..
‘గృహ లక్ష్మి’ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం లో ఇంటి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ. 2 వేలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జులై 19వ తేదీ నుంచి ప్రారంభమైంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ప్రధాన ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తమ రేషన్ కార్డును, బీపీఎల్ (Below Poverty Line BPL) కార్డును, ఏపీఎల్ (above Poverty Line APL) కార్డును, లేదా అంత్యోదయ కార్డును, ఆధార్ కార్డు కాపీలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఆధార్ తో బ్యాంక్ ఖాతా లింక్ అయి లేని వారు తమ బ్యాంక్ పాస్ బుక్ కాపీని కూడా జత చేయాలి.