iPhone 5G support: ఐ ఫోన్ యూజర్లకు 5జీ అప్ డేట్ ఎప్పుడు? ఏయే మోడళ్లపై.?-apple may roll out iphone 5g support in india by december ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Apple May Roll Out Iphone 5g Support In India By December?

iPhone 5G support: ఐ ఫోన్ యూజర్లకు 5జీ అప్ డేట్ ఎప్పుడు? ఏయే మోడళ్లపై.?

HT Telugu Desk HT Telugu
Oct 11, 2022 07:50 PM IST

iPhone 5G support: భారత్ లో 5 జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంపిక చేసిన నగరాల్లో ఎయిర్ టెల్, జియో టెలీకాం సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ, ఐ ఫోన్ యూజర్ల ఎదురు చూపులు మాత్రం కొనసాగుతున్నాయి.

యాపిల్ సంస్థ లోగో
యాపిల్ సంస్థ లోగో (AFP)

iPhone 5G support: ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ టెల్, జియో ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో |#+|5G|#+| కంపేటబిలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్ లను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

iPhone 5G support: iPhone యూజర్లకు ఎప్పుడు?

భారత్ లో ఐ ఫోన్ వినియోగదారుల సంఖ్య తక్కువేం కాదు. అదీకాక, సంపన్నులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉన్నతోద్యోగులు ఐ ఫోన్ నే ఎక్కువగా వాడుతుంటారు. వారంతా తమ iPhoneలలో 5 జీ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే ఎదురుచూపుల్లో ఉన్నారు.

iPhone 5G support: ఈ డిసెంబర్ లో..

ఈ విషయంపై ఇప్పటివరకు యాపిల్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, భారత్ లో ఎంపిక చేసిన iPhone మోడళ్లలోని iOS software లలో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 5G update ని యాపిల్ అందించబోతోందని సమాచారం. ప్రస్తుతం అది టెస్టింగ్ దశలో ఉందని టెక్ మీడియా కథనం. అయితే, Apple iPhone 12, ఆ పై మోడళ్లు మాత్రమే 5జీ నెట్ వర్క్ సపోర్ట్ తో వస్తున్నాయి.

iPhone 5G support: ఎయిర్ టెల్ తో చర్చలు

భారత్ లోని ఐ ఫోన యూజర్లకు 5 జీ సేవలను అందించే విషయంలో త్వరలో యాపిల్, ఎయిర్ టెల్ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఇప్పటికే, ఎయిర్ టెల్ , జియో నెట్ వర్క్ లపై ఐ ఫోన్ 5జీ సేవలను అందించడానికి సంబంధించి కూడా యాపిల్ పరీక్షలు జరుపుతోంది.

IPL_Entry_Point