Anwar Ibrahim becomes Malaysia PM: మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం!-anwar ibrahim becomes malaysia pm after decades of waiting ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Anwar Ibrahim Becomes Malaysia Pm After Decades Of Waiting

Anwar Ibrahim becomes Malaysia PM: మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం!

మలేసియా నూతన ప్రధాని అన్వర్ ఇబ్రహీం
మలేసియా నూతన ప్రధాని అన్వర్ ఇబ్రహీం

Anwar Ibrahim becomes Malaysia PM: దశాబ్దాల ఎదురుచూపుల అనంతరం మలేసియా నేత అన్వర్ ఇబ్రహీం తన లక్ష్యాన్నిచేరుకున్నారు. ఆయన నేతృత్వంలోని సంస్కరణవాద ‘పకటన్ హరపన్’ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ప్రకటించారు.

Anwar Ibrahim becomes Malaysia PM: ఇటీవల మలేసియాలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏ కూటమికి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. కానీ, సీనియర్ నేత అన్వర్ ఇబ్రహీం నాయకత్వంలోని పకటన్ హరపన్ కూటమికి మెజారిటీ సీట్లు వచ్చాయి. దాంతో, తదుపరి ప్రభుత్వాన్ని పకటన్ హరపన్ ఏర్పాటు చేస్తుందని మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Anwar Ibrahim becomes Malaysia PM: సంస్కరణ వాద నేత

అన్వర్ ఇబ్రహీం మలేసియాలో సీనియర్ మోస్ట్ నాయకుడు. సంస్కరణ వాద నేత. దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. చాలా సార్లు ప్రధాని పదవి ఆయన దగ్గర వరకు వచ్చి చేజారిపోయింది. సోడోమి(sodomy) ఆరోపణలపై చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.

Anwar Ibrahim becomes Malaysia PM: ప్రమాణ స్వీకారం

మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో అన్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో, గత 5 రోజులుగా మలేసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. ఏ పార్టీకి కానీ, ఏ కూటమికి కానీ మెజారిటీ రాకపోవడం మలేసియాలో 1957 తరువాత ఇదే ప్రథమం. తన పాలనలో అవినీతికి తావు లేదని, ఎవరిపై కూడా వివక్షఉండదని అన్వర్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడతానన్నారు.