Another video of Delhi minister Satyendar Jain: జైన్ జైలు వీడియో నెంబర్ 3..
Another video of Delhi minister Satyendar Jain: ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తిహార్ జైలు వీడియోలు వెబ్ సిరీస్ ల తరహాలో ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా, శనివారం జైన్ జైలు వీడియో నెంబర్ 3 రిలీజ్ అయింది.
అక్రమాస్తులు, మనీ లాండరింగ్ కేసులో ఆప్ న ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం తిహార్ జైళ్లో ఉన్నాడు. అయితే, ఆయన జైలు గదిలో రాజభోగాలు అనుభవిస్తున్నాడని, వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నాడని బీజేపీ చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. తాజాగా, ఆ ఆరోపణలు నిజమని తేల్చే వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
మూడో వీడియో
సత్యేంద్ర జైన్ జైళ్లో పొందుతున్న సేవలు, గౌరవానికి సంబంధించిన మరో వీడియో శనివారం వైరల్ అయింది. సెప్టెంబర్ నెలలో సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో దాదాపు 10 నిమిషాలు ఉంటుంది. ఈ వీడియోలో, జైన్ జైలు గదిలోని తన మంచంలో పడుకుని, అక్కడ నిలుచుని ఉన్న నలుగురైదుగురితో మాట్లాడుతున్నాడు. ఆ తరువాత ఆ గదిలోకి మరో వ్యక్తి వచ్చి, మంచం పక్కన ఉన్న కుర్చీలో గౌరవంగా కూర్చున్నాడు. ఆ చివరగా వచ్చిన వ్యక్తే గతంలో తిహార్ జైలు సూపరింటెండెంట్ గా పని చేసిన అజిత్ కుమార్. సత్యేంద్ర జైన్ కు జైళ్లో వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ఆయన ఆ తరువాత సస్పెండ్ అయ్యాడు. ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్దమవుతోంది.
గతంలో రెండు వీడియోలు..
సత్యేంద్ర జైన్ జైలు వైభోగాలకు సంబంధించి ఇప్పటికే రెండు వీడియోలు బయటకు వచ్చి, వైరల్ అయ్యాయి. అందులో ఒకదానిలో సత్యేంద్రజైన్ జైలు గదిలో మంచంపై పడుకుని ఉండగా, ఒక వ్యక్తి ఆయన కాళ్లు నొక్కుతూ మసాజ్ చేస్తున్న దృశ్యాలున్నాయి. మంచంపై రిమోట్, కొన్ని డాక్యుమెంట్లు, పక్కన ఒక కుర్చీ ఉన్నాయి. రెండో వీడియోలో, సత్యేంద్ర జైన్ కు బయట నుంచి ఆహారం వచ్చిన విషయం రికార్డైంది. బయటి నుంచి వచ్చిన ఆహారాన్ని ఆయన తింటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఈ సీరీస్ లో తాజాగా వచ్చింది మూడో వీడియో.
ఆప్ కు నష్టమా?
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ
.