Student suicide in Kota: కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య; ఈ నెలలో 3 బలవన్మరణాలు
Student suicide in Kota: నీట్, జేఈఈ వంటి పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలకు రాజస్తాన్ లోని కోట పట్టణం ఫేమస్. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడికి తట్టుకోలేక పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు (suicides).
Student suicide in Kota: ప్రఖ్యాత ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలకు రాజస్తాన్ లోని కోట పట్టణం ఫేమస్. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఆ తరువాత, కోచింగ్ సెంటర్లలోని ఒత్తిడికి తట్టుకోలేక పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. బిహార్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
NEET student: నీట్ కోచింగ్ కోసం వచ్చి..
బిహార్ లోని నలంద పట్టణం నుంచి నీట్ యూజీ కోచింగ్ కోసం కోట కు వచ్చిన 16 ఏళ్ల విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడు ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. వైద్య విద్యను అభ్యసించి, డాక్టర్ కావాలని కలలు కన్న ఆ విద్యార్థి కోచింగ్ సెంటర్లలోని ఒత్తిడికి తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణం తీసుకున్నాడు. ఈ బిహార్ విద్యార్థి నెల క్రితమే నీట్ కోచింగ్ కోసం కోట కు వచ్చాడని పోలీసులు తెలిపారు.
3 suicides this month: ఈ నెలలో మూడో ఆత్మహత్య
నీట్, జేఈఈ వంటి పరీక్షల కోచింగ్ కే కాకుండా, ఆ కోచింగ్ కోసం వచ్చే విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా కోట ఫేమస్ గా మారింది. ఈ నెలలో ఇప్పటివరకు ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఈ సంవత్సరంలో మొత్తం 8 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గత సంవత్సరం మొత్తం 15 మంది విద్యార్థులు కోటలో ఆత్మహత్య చేసుకున్నారు. కోటలో ప్రతీ సంవత్సరం సుమారు 2.25 లక్షల మంది విద్యార్థులు నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకుంటారు.