Another Shraddha Walkar case: రాజస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి తన అత్తను దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని ఢిల్లీలోని పలు నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ కు చెందిన అనుజ్ శర్మ అలియాస్ అచిత్య గోవింద దాసుకు తన అత్తతో ఇంట్లో గొడవ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. ఢిల్లీకి వెళ్దామన్న అనుజ్ శర్మను సూచనను ఆమె తిరస్కరించింది. దాంతో వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దాంతో, విచక్షణ కోల్పోయిన అనుజ్ శర్మ ఆమె తలపై సుత్తితో బాది హత్య చేశాడు. ఆ తరువాత, పోలీసుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో, ఆమె మృతదేహాన్ని మార్బుల్ కట్టర్, కత్తి తో ముక్కలుగా చేశాడు. అనంతరం, వాటిని ఢిల్లీ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు.
ఆ తరువాత తెలివిగా, తన అత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే, అతడిచ్చిన సమాచారంలో ఏదో తేడా ఉందని గ్రహించిన పోలీసులు.. లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతడు ఢిల్లీ శివార్లలో పడేసిన ఆమె శరీర భాగాల్లో చాలా వాటిని పోలీసులు రికవర్ చేసుకున్నారు.
టాపిక్