Peeing Incident: విమానంలో మరో పీయింగ్ ఘటన.. తోటి ప్యాసింజర్‌పై మూత్రం పోసిన విద్యార్థి
Peeing Incident in Flight: న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన విమానంలో ఓ ప్రయాణికుడు.. తోటి ప్యాసింజర్‌పై మూత్రం పోశారు. అతడిని ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Peeing Incident in Flight: విమానంలో మరోసారి అనూహ్య ఘటన జరిగింది. అమెరికాలో చదువుతున్న భారత్‍కు చెందిన ఓ విద్యార్థి.. విమానంలో తోటి ప్యాసింజర్‌పై మూత్రం పోశాడు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) AA292 విమానంలో ఇది జరిగింది. ప్రయాణికుడిపై మూత్రం పోసిన అతడిని అమెరికన్ ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
Peeing Incident in American Airlines Flight: న్యూయార్క్‌లో శుక్రవారం (మార్చి 3) ఈ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరింది. 14 గంటల ప్రయాణం తర్వాత మార్చి 4వ తేదీన ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ ప్రయాణంలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి.. మద్యం మత్తులో అమెరికా సిటిజన్ అయిన తోటి ప్యాసింజర్‌పై మూత్రం పోశాడని ఆ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అతడిని 21 ఏళ్ల ఆర్య వోహ్రాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ గుర్తించింది. అతడు అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్నాడు.
దరుసు ప్రవర్తన
Peeing Incident in American Airlines Flight: విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి అతడు దురుసుగా ప్రవర్తించాడని, సిబ్బంది చెప్పిన నిబంధనలను అసలు పాటించలేదని అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. సిబ్బందితో వాదనకు దిగుతూ సీట్లో సరిగా కూర్చునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. చివరికి 15జీ సీట్లో కూర్చున్న ప్యాసింజర్‌పై మూత్రం పోశాడని వెల్లడించింది. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయ్యాక అక్కడి అధికారులకు అతడిని అప్పగించామని ఆ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితోనూ అతడు దురుసుగా ప్రవర్తించాడని వెల్లడించింది.
Peeing Incident in American Airlines Flight: తమ సంస్థ విమానాల్లో భవిష్యత్తులో ప్రయాణించకుండా ఆర్య వోహ్రాపై బ్యాన్ విధిస్తున్నామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వోహ్రా.. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన వ్యక్తి అని తెలిపారు.
4 నెలల్లో రెండో ఘటన
Peeing Incident: గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి ఘటనే ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశారు. ఈ ఘటన జనవరిలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‍పై ఆయన బయటికి వచ్చారు.
సంబంధిత కథనం