Indian Student Death in US : వారంలో మూడో భారత విద్యార్థి మృతి.. అమెరికాలో ఏం జరుగుతోంది!
Indian Student Found Dead In US : వారం రోజుల వ్యవధిలో అమెరికాలో మూడో భారతీయ విద్యార్థి మరణించాడు. సిన్సినాటిలో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డి అనే విద్యార్థి.. ప్రాణాలు కోల్పోయాడు.
Indian student found dead in Cincinnati : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. శ్రేయస్ రెడ్డి మరణ వార్త.. సిన్సినాటిలో కలకలం సృష్టిస్తోంది. అంతేకాకుండా.. అమెరికాలో భారతీయ విద్యార్థి మరణించిన వార్త.. ఇది వారం రోజుల్లో మూడోది!
అసలేం జరిగింది..?
శ్రేయస్ రెడ్డి అనే భారతీయ విద్యార్థి.. ఒహాయోలోని సిన్సినాటిలో ఉన్న లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంటున్నాడు. అతని మృతదేహం పోలీసులకు లభించింది. కాగా.. అతను ఎలా మరణించాడు? ఎవరైనా హత్య చేశారా? లేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచాడా? అన్న వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు.
మరోవైపు.. అమెరికాలో భారతీయ విద్యార్థి మరణంపై న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శ్రేయస్ రెడ్డి కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నామని చెప్పింది.
Indian student found dead US : "శ్రేయస్ రెడ్డి బెనిగెరి అకాల మరణ వార్త విని బాధ కలిగింది. ఈ విషయంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే.. ఎలాంటి అనుమానాస్పద వివరాలు బయటకి రాలేదు. అతని కుటుంబంతో టచ్‌లో ఉండి, అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాము," అని ఇండియన్ కాన్సులేట్ ఓ ప్రకటనలో తెలిపింది.
సిన్సినాటిలో శ్రేయస్ రెడ్డి మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వారంలో మూడో కేసు..
Shreyas Reddy Ohio : అమెరికాలో భారతీయ విద్యార్థి మరణ వార్తలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా.. శ్రేయస్ రెడ్డితో కలుపుకుని.. గత వారం రోజుల్లో మొత్తం ముగ్గురు భారత విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. శ్రేయస్ కన్నా ముందు.. వివేక్ సైని, నీల్ ఆచార్య అనే భారత విద్యార్థులు మరణించారు.
పుర్డ్యూ వర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య మరణించినట్టు జనవరి 30న అక్కడి అధికారులు ప్రకటించారు. తన కుమారుడు అదృశ్యమైనట్టు.. నీల్ తల్లి గౌరి చెప్పిన ఒక్క రోజు అనంతరం అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
America news latest : "నా కుమారుడు నీల్ ఆచార్య.. జనవరి 28 (స్థానిక కాలమానం ప్రకారం) నుంచి కనిపించడం లేదు. చివరిగా.. ఆచార్యని ఓ ఊబర్ క్యాబ్ డ్రైవర్ పుర్డ్యూ వర్సిటీలో డ్రాప్ చేశాడు. మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నాము. మీకేమైనా తెలిస్తే సాయం చేయండి," అని గౌరి ఆచార్య ట్వీట్ చేశారు.
ఈ విషయంపై ఇండియన్ కాన్సులేట్ వెంటనే స్పందించింది. అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్టు పేర్కొంది. కానీ.. ఒక్క రోజు వ్యవధిలోనే నీల్ ఆచార్య మృతదేహం లభించింది.
ఇక జనవరి 29న.. భారతీయ విద్యార్థి వివేక్ సైని సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఓ పార్ట్ టైమ్ ఉద్యోగంలో ఉన్న అతడిని.. ఓ నిరాశ్రయుడు సుత్తితో పదేపదే దాడి చేసి.. హతమార్చాడు. ఈ వార్త కలకలంం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం