Anna Hazare : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్న హజారే రియాక్షన్ ఇది- ‘చేసిన పనులు..’
Anna Hazare Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్న హజారే స్పందించారు. వీరిద్దరు కలిసి.. గతంలో అవినీతిపై ఉద్యమం చేసిన విషయం తెలిసిందే!

Anna Hazare on Arvind Kejriwal : సామాజిక కార్యకర్త అన్న హజారే.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌కు.. ఆయన చేసిన పనులే కారణం అన్ని అన్నారు.
2010 దశకంలో అవినీతికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అన్న హజారే. అదే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పేరు తెచ్చుకున్నారు అరవింద్ కేజ్రీవాల్.
తాము మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశామని, కానీ ఇప్పుడు.. అదే మద్యానికి పాలసీలు చేస్తూ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని అన్నారు అన్న హజారే..
"నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే విషయంపై పాలసీలు చేస్తుండటం బాధగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్‌కు కారణం.. ఆయన చేసిన పనులే," అని తెలిపారు అన్న హజారే.
Arvind Kejriwal arrested : నాడు.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్‌ని తీసుకురోవాలని తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు అన్న హజారే, అరవింద్ కేజ్రీవాల్. ఇద్దరు.. అనేకమార్లు నిరాహార దీక్ష చేశారు. ఈ ఇద్దరికి కోట్లాది మంది భారతీయులు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో.. ఉద్యమం వెనుక రాజకీయం లేదని అన్న హజారే చెబుతూ వచ్చారు. కానీ ఉద్యమం తుదు దశకు చేరుకున్నప్పుడు.. ఇతరులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్.
కేజ్రీవాల్.. రాజకీయ పార్టీ పెట్టడంపై అనేకమార్లు అసంతృప్తిని, అసహానన్ని వ్యక్తం చేశారు అన్న హజారే.
అరవింద్ కేజ్రీవాల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు..?
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు.. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. దేశంలో పదవిలో ఉన్న ఒక సీఎం అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి!
Delhi liquor scam case explained in Telugu : ఇదే కేసులో.. బీఆర్ఎస్ నేత కవిత, ఆమ్ ఆద్మీ నేత- దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్‌లు ఇప్పటికే జైలులో ఉన్నారు. అసలేంటి ఈ లిక్కర్ స్కామ్ కేసు? అని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ.. జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ చెబుతోంది. కానీ.. నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వీటన్నింటి మధ్య.. దిల్లీవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది ఆమ్ ఆద్మీ. ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
సంబంధిత కథనం