Amritpal Singh news : అమృత్ పాల్ సింగ్ లొంగిపోవడానికి అసలు కారణం ఇదేనా?
Amritpal Singh arrest : అమృత్ పాల్ సింగ్ లొంగిపోవడానికి అసలు కారణం ఏంటి? అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అమృత్ పాల్‌పై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.
Amritpal Singh arrest : ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్.. పంజాబ్ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్ పాల్ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్ పంజాబ్ దే చీఫ్.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్‌కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్న అమృత్ పాల్ సింగ్.. మరి ఇప్పుడే ఎందుకు లొంగిపోయినట్టు?
ఇదే అసలు కారణం..!
ఈ పూర్తి వ్యవహారంలో.. అమృత్ పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్ పాయింట్ అని తెలుస్తోంది. బ్రిటీష్ పౌరసత్వం ఉన్న కిరణ్‌దీప్ కౌర్.. దేశాన్ని విడిచిపెట్టి, అమృత్సర్ నుంచి లండన్‌కు వెళ్లాలని ప్లాన్ చేయగా విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆమెను విచారించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే అమృత్ పాల్ లొంగిపోయాడు.
Amritpal Singh latest news : కిరణ్‌దీప్ కౌర్‌పై పోలీసులు నిఘా పెట్టినప్పటి నుంచి ఈ వారిస్ పంజాబ్ దే చీఫ్‌పై ఒత్తిడి విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారని అతను భయపడినట్టు సమాచారం. కిరణ్‌దీప్ కౌర్ సయంతోనే అమృత్ పాల్.. నిధులను యూకేకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే పోలీసులు కౌర్‌ను అరెస్ట్ చేస్తారని అమృత్ పాల్ భయపడినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి :- Who is Amritpal Singh?: ఎవరీ అమృత్‍పాల్ సింగ్? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
కిరణ్‌దీప్ కౌర్ వీసా ఈ ఏడాది జులైలో ముగుస్తుంది. అంతకన్నా ముందే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లి పోవాలని ఆమె ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. అమృత్ పాల్ సింగ్ ఈపాటికే ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందని, భార్యను సేఫ్‌గా దేశాన్ని దాటించిన తర్వాత అతను కూడా పారిపోవాలని ప్లాన్ చేసినట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
అసోంలోని జైలుకు అమృత్ పాల్..
Amritpal Singh arrested news : మరోవైపు.. అమృత్ పాల్‌ను అసోం ఢిబ్రుగఢ్లోని జైలుకు తరలించారు. అక్కడే అతని మద్దతుదారుల్లోని 8మంది ఉన్నారు. అమృత్ పాల్‌తో పాటు వీరందరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
కాగా.. అమృత్ పాల్ అరెస్ట్ వ్యవహారాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మన్ దగ్గరుండి పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్టు సమాచారం.
అమృత్ పాల్ సింగ్‌కు ఫాలోయింగ్ ఎక్కువే!
Amritpal Singh Kirandeep Kaur : ఖలిస్థానీ దేశం కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తున్న వారిలో ఈ అమృత్ పాల్ ఒకడు. అతడికి పంజాబ్ ప్రజల్లో భారీ ఫాలోయింగ్ ఉంది! ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. అమృత్ పాల్ మద్దతుదారుడు, ఓ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అమృత్ పాల్ మద్దతుదారులు.. భారీ కత్తులు, తుపాకులతో అంజాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
సంబంధిత కథనం
టాపిక్