18 additional CRPF companies in JK: కశ్మీర్ కు మరో 18 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు-amid attacks on civilians centre to deploy 18 additional crpf companies in jk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Amid Attacks On Civilians, Centre To Deploy 18 Additional Crpf Companies In J-k

18 additional CRPF companies in JK: కశ్మీర్ కు మరో 18 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 09:17 PM IST

18 additional CRPF companies in JK: జమ్మూకశ్మీర్ కు అదనంగా మరో 18 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force CRPF) ను పంపించనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

18 additional CRPF companies in JK: కశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఇటీవల సాధారణ పౌరులపై జరిగిన రెండు ఉగ్రవాద దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కు అదనంగా 18 కంపెనీల బలగాలను పంపించాలని సీఆర్ పీఎఫ్ (CRPF) నిర్ణయించింది .

ట్రెండింగ్ వార్తలు

18 additional CRPF companies in JK: 18 కంపెనీలు..

18 కంపెనీలు అంటే, సుమారు 1800 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు జమ్మూకశ్మీర్ లో అదనంగా విధులు నిర్వర్తిస్తారు. వీరిని ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో విధుల్లో చేర్చే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 18 కంపెనీల్లో 10 కంపెనీల దళాలు ఢిల్లీ నుంచి తరలి వస్తున్నాయని, 8 కంపెనీల బలగాలను సమీప ప్రాంతాల నుంచి తరలిస్తున్నారని సమాచారం. జమ్మూకశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర హోం శాఖ అక్కడికి అదనపు సీఆర్ఫీఎఫ్ బలగాలను పంపించాలని ఆదేశించింది. జనవరి 1 సాయంత్రం, జనవరి 2 ఉదయం రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి తెగబడ్డారు. ఆ రెండు దాడుల్లో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాల పాలయ్యారు. కశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

18 additional CRPF companies in JK: ఇళ్లల్లోకి చొరబడి..

ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో ఉగ్రవాదులు రాజౌరి జిల్లాలోని అప్పర్ డాంగ్రి గ్రామంలోని మూడు ఇళ్లల్లోకి వేర్వేరుగా చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఆ ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

IPL_Entry_Point