Monalisa In Mahakumbh : మహా కుంభమేళాలో మోనాలిసా.. ఆ కళ్లకే అందరూ పడిపోతున్నారు.. సోషల్ మీడియా షేక్-amber eyes dusky skin garland seller monalisa in mahakumbh stealing hearts for her beauty viral in social media ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monalisa In Mahakumbh : మహా కుంభమేళాలో మోనాలిసా.. ఆ కళ్లకే అందరూ పడిపోతున్నారు.. సోషల్ మీడియా షేక్

Monalisa In Mahakumbh : మహా కుంభమేళాలో మోనాలిసా.. ఆ కళ్లకే అందరూ పడిపోతున్నారు.. సోషల్ మీడియా షేక్

Anand Sai HT Telugu
Jan 19, 2025 10:47 PM IST

Monalisa In Mahakumbh : మహా కుంభమేళాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎలా అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఇప్పుడు చూలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకంత వైరల్ అవుతోంది?

మహా కుంభమేళాలో వైరల్ అయిన యువతి
మహా కుంభమేళాలో వైరల్ అయిన యువతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. త్రివేణి సంగమం వద్దకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని ఒక వ్యక్తి మాత్రం బాగా వైరల్ అయింది. ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యక్తి ఆమె. కుంభమేళాలో దండలు అమ్ముతూ కనిపించింది. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎవరబ్బా ఈ నేచురల్ బ్యూటీ అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు జనాలు.

yearly horoscope entry point

అందమే అసూయపడేలాంటి రూపం. ఆమె కళ్లు, ఆమె నవ్వు జనాలను పడిపోయేలా చేస్తున్నాయి. ఎవరో కళాకారుడు చెక్కినట్టుగా ఉన్న మోనాలిసా రూపం చూసి ఫిదా అయిపోతున్నారు. మహా కుంభమేళాకు వచ్చిన విదేశీయులు కూడా ఆమెతో మాట్లాడుతున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ మోనాలిసా సమాధానం ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

పొడవాటి హెయిర్, అల్లిన జుట్టుతో ఆమెను చూస్తూ మురిసిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఈ మహిళ సెన్సేషన్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ఆమె వీడియోలు, ఫొటోలతో నిండిపోతుంది. సెల్ఫీలు, వీడియోలతో ఆమె చుట్టూ జనాలు చేరుతున్నారు. ఒక వీడియోలో ఒక వ్లాగర్ ఆమెను ఎక్కడి నుండి వచ్చారని అడగ్గా.. ఇండోర్ నుంచి అని సమాధానం ఇచ్చింది.

సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసల దండలు ధరించింది యువతి. చేతిలో బ్యాగుతో ఘాట్ వద్ద దండలు అమ్ముతూ కనిపించింది. సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్స్ ఆమెను పొగుడుతూ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేశారు. ఆమె కళ్లు చూసి పడిపోతున్నామని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు హార్ట్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

ఓ వీడియోలో ఆమెకు పెళ్లైందా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. యువతి మాత్రం హుందాగా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చింది. మెుత్తానికి మహా కుంభమేళాలో మోనాలిసా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.