LIC IPO | రేపే లిస్టింగ్​.. నష్టాలు వస్తే మదుపర్లు ఏం చేయాలి?-all you need to know before lic ipo listing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All You Need To Know Before Lic Ipo Listing

LIC IPO | రేపే లిస్టింగ్​.. నష్టాలు వస్తే మదుపర్లు ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu
May 16, 2022 03:49 PM IST

LIC IPO listing | రేపే ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​. మరి లిస్టింగ్​ ఎలా ఉండనుంది? ప్రస్తుతం.. జీఎంపీ ఏం సూచిస్తోంది? ఒకవేళ నష్టాలు వస్తే.. మదుపర్లు ఏం చేయాలి?

రేపే ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​
రేపే ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​ (MINT_PRINT)

LIC IPO listing | దాదాపు రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పడిన శ్రమకు మంగళవారంతో ముగింపు పడనుంది! అనేక అవాంతరాల అనంతరం చివరికి.. ఎల్​ఐసీ ఐపీఓ రేపు స్టాక్​ మార్కెట్​లో లిస్టికానుంది. ఇప్పుడు అందరి చూపు.. ఇండియాలోనే అతిపెద్ద ఐపీఓ లిస్టింగ్​పైనే. మరి ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​ ఎలా జరగనుంది? మదుపర్లకు లాభాలు వస్తాయా? ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం ఏం సూచిస్తోంది? నష్టాల్లో లిస్ట్​ అయితే.. మదుపర్లు ఏం చేయాలి?

ట్రెండింగ్ వార్తలు

ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ..

ఎల్​ఐసీ షేర్లు గ్రే మార్కెట్​లో ప్రస్తుతం రూ. 19 డిస్కౌంట్​లో ట్రేడ్​ అవుతున్నాయి. అంటే.. ప్రైజ్​ బ్యాండ్​(రూ. 949)తో పోల్చుకుంటే.. ఎల్​ఐసీ షేర్లు రూ. 930 వద్ద లిస్ట్​ అవుతాయని అంచనా! లిస్టింగ్​ రోజు స్వల్ప నష్టాలు తప్పవని ఈ ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ సూచిస్తోంది. శుక్రవారం.. ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ మైనస్​ రూ. 13గా ఉండేది.

LIC IPO GMP today | ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.

అయితే.. ఓ సంస్థ ఐపీఓకు అప్లై చేయాలా? వద్దా? అని ఆలోచించేందుకు.. గ్రే మార్కెట్​ ప్రీమియంను ప్రామాణికంగా చూడవద్దని మార్కెట్​ విశ్లేషకులు సూచిస్తూ ఉంటారు. కంపెనీ ఫండమెంటల్స్​, పీ అండ్​ ఎల్​ స్టేట్​మెంట్​, బ్యాలెన్స్​ షీట్​. వ్యాపారం వంటివి చూసి ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేయాలని చెబుతుంటారు.

నష్టాలు వస్తే ఏం చేయాలి?

వాస్తవానికి ఎల్​ఐసీ ఐపీఓకు.. ఊహించిన దాని కన్నా ఎక్కువ డిమాండే లభించిందని చెప్పుకోవాలి. పాలసీదారులు, రిటైలర్లు.. ఐపీఓ పాల్గొనేందుకు ఎగబడ్డారు. కానీ ఎఫ్​ఐఐలు మాత్రం ఎల్​ఐసీ ఐపీఓకు దూరంగానే ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు ఈ విషయం.. ఐపీఓకు ప్రతికూలంగా మారింది. ఫలితంగా.. ఎల్​ఐసీ ఐపీఓకు నష్టాలు వస్తాయని మార్కెట్​ విశ్లేషకులు గతకొంతకాలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Will LIC IPO fail | ఈ క్రమంలో స్వస్తిక ఇన్​వెస్ట్​మార్ట్​ సీనియర్​ అనలిస్ట్​ ఆయుష్​ అగర్వాల్​ కీలక సూచనలు చేశారు.

"ఎల్​ఐసీకి మంచి బ్రాండ్​ వాల్యూ ఉంది. కానీ సంస్థ.. తన మార్కెట్​ షేరును కోల్పోతుండటం ఆందోళనకర విషయం. బీమా వ్యాపారం అనేది దీర్ఘకాలికం అన్న విషయాన్ని మదుపర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పట్లో ఆ వ్యాపారం ముగిసిపోదు. అందుకే.. దీర్ఘకాలం కోసం ఎల్​ఐసీలో పెట్టుబడులు పెట్టవచ్చు. లిస్టింగ్​ డే రోజు.. నష్టాలు వచ్చినా.. మదుపర్లు భయపడకుండా.. దీర్ఘకాలం కోసం స్టాక్​ను విక్రయించకుండా ఉంటే మంచిది," అని అగర్వాల్​ తెలిపారు.

మరోవైపు.. లిస్టింగ్​ డే రోజు నష్టాలు వస్తే.. మరిన్ని షేర్లు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని మెహ్తా ఈక్విటీస్​ వైస్​ ప్రెసిడెంట్​ తాప్సె అభిప్రాయపడ్డారు. అందువల్ల మదుపర్లు భయపడకూడదని సూచించారు.

ఎల్​ఐసీ ఐపీఓ వివరాలు..

  • LIC IPO details | ఐపీఓ సైజు:- రూ. 21వేల కోట్లు (దేశంలోనే అతిపెద్ద ఐపీఓ)
  • ఐపీఓ డేట్​:- మే 4- మే 9
  • ఐపీఓ ప్రైజ్​:- రూ. 902- రూ. 949/షేరు. కచ్చితంగా షేర్లు అలాట్​ అవ్వాలంటే.. అప్పర్​ బ్యాండ్​(రూ. 949)తో బిడ్లు వేయడం ఉత్తమం.
  • అప్లికేషన్​ లిమిట్​:- ఒక వ్యక్తి.. 14 ఐపీఓ బిడ్లను అప్లై చేసుకోవచ్చు.
  • పాలసీదారులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 60
  • ఎల్​ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 45
  • అలాట్​మెంట్​ డేట్:- మే 12

ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్

LIC IPO subscription | ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ దాదాపు ముగింపునకు చేరింది. కొన్ని గంటల తర్వాత ఐపీఓను సబ్​స్క్రైబ్​ చేసుకోలేరు. ప్రస్తుత ఐపీఓ సబ్​స్క్సిప్షన్​ వివరాలను తెలుసుకుందాము.

  • క్యూఐబీ:- 2.22X
  • ఎన్​ఐఐ:- 2.12X
  • రిటైల్​:- 1.85X
  • ఉద్యోగులు:- 5.73X
  • పాలసీదారులు:- 2.55X

(గమనిక ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. స్టాక్​ మార్కెట్​ వ్యవహారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్