MAT 2023: ‘మ్యాట్’ తేదీలను ప్రకటించిన ఏఐఎంఏ-all india management association announces mat 2023 december edition ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All India Management Association Announces Mat 2023 December Edition

MAT 2023: ‘మ్యాట్’ తేదీలను ప్రకటించిన ఏఐఎంఏ

HT Telugu Desk HT Telugu
Nov 23, 2023 11:52 AM IST

MAT 2023: ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2023 తేదీలను ప్రకటించింది. ఈ పరీక్ష డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 17 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

MAT 2023: దేశంలోని ప్రఖ్యాత మేనేజ్మెంట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ను ఈ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 17 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Highlights of MAT 2023: మ్యాట్ 2023 ప్రత్యేకతలు

  • మేనేజ్మెంట్ విద్యలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు మ్యాట్ 2023 (MAT 2023) ద్వారా 600 లకు పైగా బిజినెస్ స్కూల్స్ లో అడ్మిషన్లు తీసుకుంటారు.
  • మ్యాట్ లో పేపర్ ఆధారిత పరీక్ష (PBT), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), మరియు ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష (IBT) అనే మూడు టెస్టింగ్ మోడ్స్ ఉంటాయి.
  • లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, అండర్ స్టాండింగ్ స్కిల్స్, ఇంటర్ ప్రిటేషన్ స్కిల్స్ ను ప్రధానంగా పరీక్షిస్తారు.
  • అలాగే, మేథమెటికల్, ఆప్టిట్యూడ్, అనలిటికల్, క్వాంటిటేటివ్ స్కిల్స్ ను కూడా పరీక్షిస్తారు.
  • మ్యాట్ స్కోర్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థుల మ్యాట్ స్కోర్ ను 5 బిజినెస్ స్కూల్స్ కు ఉచితంగా పంపిస్తారు.

MAT Schedule: మ్యాట్ షెడ్యూల్

• CBT [కంప్యూటర్-ఆధారిత పరీక్ష] - పరీక్ష తేదీ: డిసెంబర్ 3. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ నవంబర్ 28.

• IBT [ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష] - పరీక్ష తేదీ: డిసెంబర్ 6. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ డిసెంబర్ 3.

• PBT [పేపర్-బేస్డ్ టెస్ట్] - పరీక్ష తేదీ: డిసెంబర్ 9. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ డిసెంబర్ 5.

• IBT [ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష] - పరీక్ష తేదీ: డిసెంబర్ 9. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ డిసెంబర్ 6.

• CBT [కంప్యూటర్-ఆధారిత పరీక్ష] - పరీక్ష తేదీ: డిసెంబర్ 16. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ డిసెంబర్ 11.

• IBT [ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష] - పరీక్ష తేదీ: డిసెంబర్ 17. రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ డిసెంబర్ 14.

WhatsApp channel