Alaska Airlines flight : గాలిలో విరిగి పడిపోయిన విమానం డోర్- ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!
Alaska Airlines flight : విమానం గాలిలో ఉండగా.. డోర్ ఊడిపోతే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భయంకరంగా ఉంది కదూ! కానీ అమెరికాలో ఇదే జరిగింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Alaska Airlines flight : అలస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురైన ఘటన ఇది! విమానం గాలిలో ఉండగా.. అకస్మాత్తుగా కిటికీ పగిలిపోయి, ఊడిపోవడంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యరు. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది..
ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని ఒంటారియోకు వెళ్తున్న విమానంలో జరిగింది ఈ ఘటన. ఈ విషయంపై అలాస్కా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 171 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది సురక్షితంగా ల్యాండ్ అయ్యారని వెల్లడించింది. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్న విమానయాన సంస్థ.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించింది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
Alaska Airlines flightviral video : అలాస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం గాలిలో ఉండగా.. మధ్యలో ఉన్న కిటికీ పగిలిపోయి, ఊడిపోవడంతో కేబిన్ ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోయింది. ఆ వెంటనే.. పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకరం.. భారీ శబ్దం అనంతరం కిటికీ పగిలిపోయింది. విమానానికి రంధ్రం ఏర్పడింది. విమానం 16,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఇది జరిగింది. అదృష్టవశాత్తు కిటికీ దగ్గర సీటు ఖాళీగా ఉంది. కానీ సమీపంలో కూర్చున్న ఒక బాలుడు భయాందోళనకు గురయ్యాడు.
Alaska Airlines flight Boeing 737 viral video : అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదని తెలుస్తోంది కానీ.. కొందరు ప్రయాణీకులు తమ ఫోన్లను కూడా పోగొట్టుకున్నారు. గాలి కారణంగా అవి విమానం నుంచి బయటపడిపోయాయి.
బోయింగ్ 737 మ్యాక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన విమాన మోడళ్లలో ఒకటి. కానీ భద్రతా సమస్యలు నిత్యం ఈ విమానాన్ని వెంటాడుతూ ఉంటాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:-
సంబంధిత కథనం