Nitrogen gas execution: నైట్రోజన్ తో తొలిసారి మరణ శిక్షను అమలు చేసిన అమెరికా-alabama carries out us first execution using nitrogen gas ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Alabama Carries Out Us' First Execution Using Nitrogen Gas

Nitrogen gas execution: నైట్రోజన్ తో తొలిసారి మరణ శిక్షను అమలు చేసిన అమెరికా

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 04:15 PM IST

Nitrogen gas execution: మరణ శిక్షను అమలు చేసేందుకు తొలిసారి నైట్రోజన్ ను అమెరికా ఉపయోగించింది. అలబామాలో 58 ఏళ్ల వ్యక్తికిి నైట్రోజన్ వాయువు ద్వారా మరణ శిక్షను అమలు చేసింది. ఈ విధానం హింసాత్మకమని ఐక్య రాజ్య సమితి పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

అమెరికాలోని అలబామాలో ఒక హత్య కేసులో దోషిగా తేలిన కెన్నెత్ యూజీన్ స్మిత్ అనే వ్యక్తికి నైట్రోజన్ వాయువును పీల్చేలా చేయడం ద్వారా మరణశిక్షను అమలు చేశారు. 1988 లో తన భార్యను పాస్టర్ కెన్నెత్ యూజీన్ స్మిత్ హత్య చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇంజక్షన్ స్థానంలో..

ఫేస్ మాస్క్ ద్వారా నైట్రోజన్ వాయువును పంపించి 58 ఏళ్ల కెన్నెత్ యూజీన్ స్మిత్ కు ఉరిశిక్ష అమలు చేశారు. ప్రస్తుతం ప్రాణాంతక ఇంజెక్షన్ ను ఇవ్వడం ద్వారా మరణ శిక్షను అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిని 1982లో ప్రవేశపెట్టారు. కెన్నెత్ యూజీన్ స్మిత్ మరణ శిక్షను కూడా ఇంజెక్షన్ ద్వారా అమలు చేయాలని అలబామా జైలు అధికారులు ప్రయత్నించారు. కానీ ఐవి లైన్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించారు.

చివరి వరకు..

నైట్రోజన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి వ్యతిరేకంగా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం జరిగింది. కెన్నెత్ యూజీన్ స్మిత్ ను నైట్రోజన్ మరణ శిక్ష విధానానికి ప్రయోగ వస్తువుగా వాడుకుంటున్నారని అతడి తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది క్రూరమైన చర్య అని, రాజ్యాంగ ఉల్లంఘన అని వాదించారు. ఈ విధానంపై సరైన పరిశోధనలు జరగలేదని, ఈ విధానాన్ని అమలు చేస్తున్న సమయంలో శిక్షకు గురవుతున్న వ్యక్తి అనుభవించే బాధ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంలో శాస్త్రీయ సమాచారం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ, చివరకు సుప్రీంకోర్టులో ఓడిపోయారు.

బీమా డబ్బుల కోసం..

అలబామాలో పాస్టర్ గా పని చేస్తున్న కెన్నెత్ యూజీన్ స్మిత్ భారీగా పెరిగిన తన అప్పులను తీర్చడానికి తన భార్యను చంపి, అనంతరం వచ్చే బీమా డబ్బులను ఉపయోగించాలని ప్లాన్ చేశాడు. 1988 లో ఈ హత్య జరగగా, స్మిత్ కు 1996 లో కోర్టు మరణ శిక్ష విధించింది.

IPL_Entry_Point