Airtel 5G in India : 12 నగరాల్లో పూర్తిగా ఎయిర్​టెల్​ 5జీ సేవలు.. లిస్ట్​ ఇదే-airtel 5g in india telecom s 5g service now available in 12 indian cities check the full list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Airtel 5g In India Telecom's 5g Service Now Available In 12 Indian Cities, Check The Full List

Airtel 5G in India : 12 నగరాల్లో పూర్తిగా ఎయిర్​టెల్​ 5జీ సేవలు.. లిస్ట్​ ఇదే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 29, 2022 01:27 PM IST

Airtel 5G in India : 5జీ సేవలు ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పటివరకు.. ఎయిర్​టెల్​ 12 నగరాల్లో 5జీ సేవలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు..

12 నగరాల్లో పూర్తిగా ఎయిర్​టెల్​ 5జీ సేవలు.. లిస్ట్​ ఇదే
12 నగరాల్లో పూర్తిగా ఎయిర్​టెల్​ 5జీ సేవలు.. లిస్ట్​ ఇదే

Airtel 5G in India : రెండు నెలల క్రితం లాంచ్​ అయిన 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ప్రజలకు 5జీ అనుభూతిని కల్పించేందుకు.. ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​లు పోటీపడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నగరాలను 5జీ జాబితాలోకి వేస్తున్నాయి. ఇప్పటికే అనేక విమానాశ్రయాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఎయిర్​టెల్​ 5జీ సేవలు దేశంలోని 12 నగరాలకు విస్తరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఎయిర్​టెల్​ 5జీ సేవలు..

ప్రస్తుతానికి ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్​, వారణాసి, ముంబై, నాగ్​పూర్​, చెన్నైతో పాటు గురుగ్రామ్​, పానిపట్​, గౌహతి నగరాల్లో ఎయిర్​టెల్​ 5జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు.. పట్నాలోని పట్నా సాహిబ్​ గురుద్వారా, పట్నా రైల్వే స్టేషన్​, దాక్​ బంగ్లా, మౌర్య లోక్​, బైలే రోడ్​, బోరింగ్​ రోడ్​, సిటీ సెంట్రల్​ మాల్​, పాటలీపుత్ర ఇండస్ట్రియల్​ జోన్​ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్​టెల్​ 5జీ సేవలను కస్టమర్లు వినియోగించుకుంటున్నారు.

Airtel 5G plans : : బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పుణె లోహెగావ్​ ఎయిర్​పోర్ట్​, వారణాసి లాల్​ బహదూర్​ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్​పూర్​ బాబాసాహెబ్​ అంబేడ్కర్​ అంతర్జాతీయ విమానాశ్రయం, పట్నా ఎయిర్​పోర్ట్​లో.. ఎయిర్​టెల్​ 5జీ సర్వీసులు లభిస్తున్నాయి.

రూ. 20వేలలోపు 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలని అనుకుంటున్నారా? ది బెస్ట్​ ఆప్షన్స్​ను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

జియో 5జీ సేవలు ఇలా..

ఇక ఎయిర్​టెల్​కు గట్టిపోటీనిస్తూ.. రిలయన్స్​ జియో సైతం 5జీ సేవలను విస్తరిస్తోంది. ఢిల్లీ, ఎన్​సీఆర్​, ముంబై, వారణాసి, కోల్​కతా, బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై, నాఠ్​వారా, పుణె, గురుగ్రామ్​, నోయిడా, ఘజియాబాద్​, ఫరీదాబాద్​ నగరాల్లో జీయో 5జీ సేవలు వస్తున్నాయి. అంతేకాకుండా.. గుజరాత్​లోని 33 జిల్లాల హెడ్​క్వార్టర్స్​లో 5జీ సేవలను ప్రవేశపెట్టింది జియో. ఫలితంగా.. ప్రతి జిల్లాలోన ఓ చోట 5జీ సేవలు పొందుతున్న తొలి రాష్ట్రంగా గుజరాత్​ నిలిచింది.

Jio 5G services : వచ్చే ఏడాది చివరి నాటికి.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరిస్తామని జియో ప్రకటించింది. ఇక ఎయిర్​టెల్​ విషయానికొస్తే.. 2024 మార్చ్​ నాటికి అన్ని నగరాలకు 5జీ సేవలందిస్తామని స్పష్టం చేసింది.

మరో టెలికాం సంస్థ వోడాఫోన్​ ఐడియాకు సంబంధించి.. 5జీ సేవల వివరాలు అందుబాటులో లేవు. 5జీ సేవలను లాంచ్​ చేస్తూ.. త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని సంస్థ చెప్పింది. కానీ ఆ తర్వాత సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు!

WhatsApp channel

సంబంధిత కథనం