AirAsia free seats : 50లక్షల విమాన టికెట్లు 'ఫ్రీ'..! ఆఫర్​ అదిరిందిగా..-airasia bumper sale 5 million free seats up for grabs till 25 september ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Airasia Bumper Sale: 5 Million Free Seats Up For Grabs Till 25 September

AirAsia free seats : 50లక్షల విమాన టికెట్లు 'ఫ్రీ'..! ఆఫర్​ అదిరిందిగా..

Sharath Chitturi HT Telugu
Sep 20, 2022 07:02 AM IST

AirAsia bumper sale : ఎయిర్​ఏషియా.. మరో ఆకర్షణీయమైన ఆఫర్​తో వచ్చేసింది. ఈసారి ఏకంగా 50లక్షల విమాన టికెట్లను ఉచితంగా* ఇచ్చేస్తోంది. ఆ వివరాలు..

ఎయిర్​ఏషియా
ఎయిర్​ఏషియా (REUTERS)

AirAsia free seats : అదిరిపోయే ఆఫర్​తో వచ్చేసింది ఏయిర్​ఏషియా! 50లక్షల మందికి విమాన టికెట్లు ఉచితంగా* ఇస్తోంది. ఈ ఆఫర్​ ఈ నెల 19న మొదలై.. 25తో ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఫ్రీ టికెట్​ బుక్​ చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఫ్రీ టికెట్​* వివరాలను సోమవారం తన వెబ్​సైట్​లో వెల్లడించింది ఎయిర్​ఏషియా. 2023 జనవరి 1 నుంచి 28 అక్టోబర్​ మధ్యలో చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్​ వర్తిస్తుందని పేర్కొంది.

AirAsia 50 lakh free seats ఎయిర్​ఏషియా 50లక్షల ఉచిత టికెట్ల ఆఫర్​ను ఇలా పొందండి..

ఎయిర్​ఏషియా ఉచిత విమాన టికెట్ల* ఆఫర్​.. సంస్థకు చెందిన వెబ్​సైట్​లో, యాప్​లో ఉంది. 'ఫ్లైట్స్​' ఐకాన్​ మీద క్లిక్​ చేసి.. ఈ ఆఫర్​ను పొందవచ్చు.

ప్రముఖ దేశీయ ప్రాంతాలకు ఈ ఆఫర్​ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. బ్యాంకాక్​ నుంచి కబ్రి, ఫుకెట్​, ఛాంగ్​ మై, సకోన్​ నకోర్న్​, నకోర్న్​ శ్రిమ్మరట్​, నాత్రంగ్​, లౌంగ్​ ప్రబంగ్​, మడలయ్​, ఫమ్​, పెనాంగ్​తో పాటు ఇతర గమ్యస్థానాలకు ఈ 50 లక్షల ఫ్రీ టికెట్ల ఆఫర్​ వర్తిస్తుంది.

How to get AirAsia free seats offers : "ఇంతకాలం మాకు అండగా నిలిచిన కస్టమర్లకు మా ధ్యనవాదాలు. అతిపెద్ద ఫ్రీ సీట్​* కార్యక్రమం చేపట్టాము. సంస్థ 21వ జన్మదినం నేపథ్యంలో ఈ ఆఫర్​ను తీసుకొచ్చాము. దీని నుంచి లబ్ధిపొందాలని కస్టమర్లకు మేము పిలుపునిస్తున్నాము. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా మా సేవలను మెరుగుపరుస్తున్నాము. కొత్త విమనాలను ప్రవేశపెడుతున్నాము," అని ఎయిర్​ఏషియా సంస్థ సీసీఓ కరెన్​ చాన్​ ఓ ప్రకటనలో వెల్లడించారు.

AirAsia : వాస్తవానికి కస్టమర్లకు ఆకర్షించేందుకు ఈ మధ్య కాలంలో విమానయాన సంస్థలు 'ఫ్రీ'గా పోటీపడుతున్నాయి. రెండు నెలల ముందే.. కస్టమర్లకు ఫ్రీ టికెట్లు ఇచ్చింది ఎయిర్​ఏషియా. ఇక ఇప్పుడు ఏకంగా 50లక్షల విమాన టికెట్లను ఉచితంగా* ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి మీరు త్వరపడండి! ఈ ఆఫర్​ ఈ నెల 25 వరకే.

IPL_Entry_Point

సంబంధిత కథనం