Air India| టాటా గూటికి ఎయిర్ ఇండియా.. ముహూర్తం ఖరారు!
ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానుంది. టాటా గ్రూప్ రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఎయిర్ ఇండియా సంస్థ పూర్తిగా టాటాల చేతిలోకి వెళ్లనుంది.
ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానుంది. టాటా గ్రూప్ రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఎయిర్ ఇండియా సంస్థ పూర్తిగా టాటాల చేతిలోకి వెళ్లనుంది.
(1 / 5)
రిపబ్లిక్ డే తర్వాత ఎయిర్ ఇండియా అధికారికంగా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను టాటా సంస్థ రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసింది.
(2 / 5)
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాతో పాటు ఎయిర్ పోర్ట్ టర్మినల్ సర్వీసెస్‌లో కూడా 50 శాతం వాటాను టాటా గ్రూప్ దక్కించుకుంది. అంతేకాకుండా జనవరి 20న ముగిసిన బ్యాలెన్స్ షీట్‌ను సమీక్షించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.
(ANI)(3 / 5)
ఎయిరిండియా సంస్థ పూర్తి భాద్యతలను జనవరి చివరి నాటికి టాటా గ్రూప్‌కు అప్పగించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
(Reuters)(4 / 5)
టాటా గ్రూప్‌కు ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏసియా-ఇండియాలో మెజారిటీ వాటాలున్నాయి. ఇక ఎయిర్ ఇండియా స్వాధీనంతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి మూడో విమానయాన బ్రాండ్ వచ్చినట్లవుతుంది.
(Reuters)(5 / 5)
ఎయిర్ ఇండియా తన ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టిందో మళ్ళీ అక్కడికే చేరుకోవడం విశేషం. 1932లో జేఆర్‌డీ టాటా.. ‘టాటా ఎయిర్ సర్వీసెస్’ పేరుతో విమానయాన సంస్థను స్థాపించారు. 1953లో టాటా ఎయిర్ సర్వీసెస్‌ను జాతీయం చేయడంతో ఆ సంస్థ భారత ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత విమానయాన రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతించాక ఎయిర్ ఇండియా నష్టాల్లో ఊబిలో కూరుకుపోయింది. ఆ తర్వాత కేంద్రం ఎయిర్ ఇండియాను వేలం వేయడంతో టాటా గ్రూప్ తిరిగి దక్కించుకుంది.
(ANI)ఇతర గ్యాలరీలు