Air India tickets : టికెట్​ ధరల 'డిస్కౌంట్'​పై ఎయిర్​ ఇండియా కీలక నిర్ణయం!-air india halves discount on basic fares for senior citizens and students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Air India Halves Discount On Basic Fares For Senior Citizens And Students

Air India tickets : టికెట్​ ధరల 'డిస్కౌంట్'​పై ఎయిర్​ ఇండియా కీలక నిర్ణయం!

Sharath Chitturi HT Telugu
Sep 30, 2022 11:03 AM IST

Air India discount for senior citizen : వృద్ధులు, విద్యార్థులకు.. టికెట్​ ధరలపై ఇచ్చే డిస్కౌంట్ల విషయంలో పలు మార్పులు చేసింది ఎయిర్​ ఇండియా. డిస్కౌంట్లను సగానికిపైగా కట్​ చేసింది.

వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చే డిస్కౌంట్​ను తగ్గించిన ఎయిర్​ ఇండియా
వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చే డిస్కౌంట్​ను తగ్గించిన ఎయిర్​ ఇండియా (HT_PRINT)

Air India discount for senior citizen : టాటా గ్రూప్​నకు చెందిన ఎయిర్​ ఇండియా.. వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చే టికెట్​ ధరల్లో డిస్కౌంట్లను సగానికి తగ్గించింది. ఈ విషయంపై ఆ సంస్థ గురువారం నిర్ణయం తీసుకుంది. సవరించిన డిస్కౌంట్లు.. గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది ఎయిర్​ ఇండియా.

ట్రెండింగ్ వార్తలు

పలు రకాల టికెట్లపై వృద్ధులు, విద్యార్థులకు టికెట్​ రేటుపై 50శాతం డిస్కౌంట్లు ఇచ్చేది ఎయిర్​ ఇండియా. తాజా నిర్ణయంతో ఆ డిస్కౌంట్​ 25శాతానికి పడిపోయింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఆ సంస్థ అధికారిక వెబ్​సైట్​లో ఉన్నాయి.

Air India discount for students : ఇక రాయితీతో కూడిన ఛార్జీలను కూడా సవరిస్తున్నట్టు ఈ నెల 28న ప్రకటించింది ఎయిర్​ ఇండియా. ఆ ఛార్జీలు కూడా గురువారమే అమల్లోకి వచ్చాయి. అయితే.. ఈ మార్పులను ఎయిర్​ ఇండియా సమర్థించుకుంది.

"డిస్కౌంట్లు తగ్గించినప్పటికీ.. విద్యార్థులకు, వృద్ధులకు ఇతరులతో పోల్చుకుంటే ఎయిర్​ ఇండియా టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయి," అని టాటా గ్రూప్​నకు చెందిన విమానయాన సంస్థ వెల్లడించింది.

Air India Tata group : విమానయాన రంగంలోని ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఈ మార్పులు చేసినట్టు ఎయిర్​ ఇండియా వెల్లడించింది. ఇండస్ట్రీ ట్రెండ్​కి తగ్గట్టు ఈ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆధీనంలో నష్టాల్లో ఎయిర్​ ఇండియాను ఈ ఏడాది జనవరిలో తన సొంతం చేసుకుంది టాటా గ్రూప్​. అప్పటి నుంచి సంస్థ అభివృద్ధికి వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం