Air India Flight: విమానంలో ప్యాసింజర్ రచ్చ: సిబ్బందికి గాయాలు, తిరిగొచ్చిన ఫ్లైట్: ఏం జరిగిందంటే!-air india flight to london returns to delhi due to unruly behavior of a passenger ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air India Flight: విమానంలో ప్యాసింజర్ రచ్చ: సిబ్బందికి గాయాలు, తిరిగొచ్చిన ఫ్లైట్: ఏం జరిగిందంటే!

Air India Flight: విమానంలో ప్యాసింజర్ రచ్చ: సిబ్బందికి గాయాలు, తిరిగొచ్చిన ఫ్లైట్: ఏం జరిగిందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 10, 2023 02:22 PM IST

Air India Flight: లండన్‍కు బయలుదేరిన ఓ ఎయిర్‌ఇండియా విమానం ఢిల్లీకి తిరిగివచ్చేసింది. ఓ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించడంతో ఇలా జరిగింది. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

Air India Flight: ఎయిర్‌ఇండియా విమానంలో ఓ ప్యాసింజర్ నానా రచ్చ చేశారు. సిబ్బందికి గాయాలయ్యేలా ప్రవర్తించారు. దీంతో లండన్‍కు వెళ్లాల్సిన విమానం మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) వెల్లడించింది. దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది. వివరాలివే..

Air India Flight: లండన్‍లోని హీత్‍‍రో ఎయిర్ పోర్టుకు బయలుదేరిన విమానం ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికి తిరిగివచ్చేసిందని ఎయిర్‌ఇండియా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ ప్యాసింజర్ తీవ్రమైన అభ్యంతరకర ప్రవర్తన వల్ల ఇలా జరిగిందని తెలిపింది.

చెప్పినా వినిపించుకోకుండా..

Air India Flight: “మాటలతో చెప్పినా, రాతపూర్వకంగా తెలిపినా ఆ ప్యాసింజర్ పట్టించుకోకుండా వికృతంగా ప్రవర్తించారు. ఇద్దరు సిబ్బందికి శారీరకంగా హానీ కలిగించారు. దీంతో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాలని పైలట్ ఇన్ కమాండ్ నిర్ణయించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అవగానే ఆ ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు” అని ఎయిర్‌ఇండియా వెల్లడించింది.

విమానం రీషెడ్యూల్

Air India Flight: విమానంలో ఉన్న ప్రతీ ఒక్కరి భద్రత, రక్షణ, గౌరవం తమకు ఎంతో ముఖ్యమని ఎయిర్‌ఇండియా పేర్కొంది. ప్రయాణికులకు కలిగి అసౌకర్యానికి చింతిస్తున్నామని, లండన్‍కు వెళాల్సిన ఈ విమానాన్ని మధ్యాహ్నానికి రీషెడ్యూల్ చేసినట్టు వెల్లడించింది.

ఉదయం 6.35 గంటలకు లండన్‍కు బయలుదేరిన ఎయిర్‌ఇండియా బోయింగ్ 787 విమానం ఢిల్లీకి ఉదయం 9.42 గంటలకు తిరిగి వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ఈ విషయంపై డీజీసీఏ కూడా విచారణ మొదలుపెట్టింది.

గతేడాది నవంబర్‌లో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ఎయిర్‌ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ చేశారు. మద్యం తాగిన ఆయన.. తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశారు. పీ-గేట్ (Pee-Gate) పేరుతో ఈ సంఘటన సంచలనంగా మారింది. చర్చనీయాంశం అయింది. ఈ ఘటన తర్వాత ప్రయాణికులకు కొన్ని మార్గదర్శకాలను ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. ఆ తర్వాత కూడా వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో కొన్ని చిన్నపాటి గొడవలు వెలుగు చూశాయి.

సంబంధిత కథనం