MP girl kidnap : యువతి చెప్పిన కిడ్నాప్​ ‘కథ’కు పోలీసులే షాక్​ అయ్యారుగా..!-after failing in college exam mp girl cooks up own kidnapping story to escape parents ire ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  After Failing In College Exam, Mp Girl Cooks Up Own Kidnapping Story To Escape Parents' Ire

MP girl kidnap : యువతి చెప్పిన కిడ్నాప్​ ‘కథ’కు పోలీసులే షాక్​ అయ్యారుగా..!

Sharath Chitturi HT Telugu
May 14, 2023 03:20 PM IST

MP girl kidnap : తాను కిడ్నాప్​ అయినట్టు ఓ యువతి.. తన తండ్రికి కాల్​ చేసి చెప్పింది. భయంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిని పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని షాక్​కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

యువతి చెప్పిన కిడ్నాప్​ కథకు పోలీసులే షాక్​ అయ్యారుగా..!
యువతి చెప్పిన కిడ్నాప్​ కథకు పోలీసులే షాక్​ అయ్యారుగా..! (PTI/representative image)

MP girl kidnap : పరీక్షలో ఫెయిల్​ అవుతున్న విద్యార్థుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇంకొందరు మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే.. మధ్యప్రదేశ్​లో డిగ్రీ పరీక్షలో విఫలమైన ఓ యువతి చేసిన పని​ చూసి.. పోలీసులే షాక్​ అయ్యారు! అసలేం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ఇండోర్​లో ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. స్థానిక కాలేజీలో ఆమె బీఏ మొదటి సంవత్సరం చదువుకుంటోంది.

కాగా.. శుక్రవారం రాత్రి.. యువతి తండ్రి పోలీసుల వద్దకు వెళ్లాడు. తన బిడ్డను ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశాడు.

MP girl kidnap case : "కాలేజీ నుంచి తిరిగొస్తుండగా.. నా కూతురిని ఎవరో కిడ్నాప్​ చేశారు. ఈ విషయం నా కూతురే చెప్పింది. 'నా సర్​ నన్ను గుడి దగ్గర దింపారు. నేను ఆటో ఎక్కి ఇంటికి వద్దామని అనుకున్నాను. కానీ ఆటో డ్రైవర్​ నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నా నోటిలో గుడ్డ కుక్కి, కొట్టాడు. కొంత సేపటికి నేను స్పృహ కోల్పోయాను నాన్న. ఆ తర్వాత వేరే వ్యక్తి ఫోన్​ నుంచి నీకు కాల్​ చేస్తున్నాను,' అని నా కూతురు నాకు చెప్పింది," అని ఆ తండ్రి బాధతో పోలీసులకు వివరించాడు.

ఘటనపై తక్షణమే స్పందించారు పోలీసులు. యువతిని రక్షించేందుకు రంగంలోకి దిగిన అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్​లకు యువతి ఫొటోను పంపించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు. శుక్రవారం రాత్రి సీసీటీవీ ఫుటేజ్​లో కనిపించిన దృశ్యాలను చూసి షాక్​నకు గురయ్యారు.

Madhya Pradesh latest news : మరోవైపు పోలీసులకు ఓ ఫోన్​ కాల్​ వచ్చింది. యువతిని ఉజ్జెయిన్​లోని ఓ రెస్టారెంట్​లో గుర్తించినట్టు ఫోన్​లో చెప్పారు. అంటే.. ఇండోర్​ నుంచి 50కి.మీల దూరం. యువతిని ఉజ్జెయిన్​ నుంచి వెంటనే ఇండోర్​కు తీసుకొచ్చారు.

పరీక్షలో విఫలమవ్వడంతో..

ఆ యువతిని ఇండోర్​కు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఆమెను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్​ అంశాన్ని లేవనెత్తారు. తాను ఆటో ఎక్కినట్టు యువతి చెప్పిందని, కానీ సీసీటీవీ ఫుటేజ్​లో అలాంటిదేమీ లేదని పోలీసులు ముందే గుర్తించి, ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే యువతి అసలు విషయాన్ని బయటపెట్టింది.

Madhya Pradesh crime news : "నేను బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పరీక్ష ఫలితాలు శుక్రవారం వచ్చాయి. నేను ఫెయిల్​ అయ్యాను. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారు, కొడతారు. నాకు భయం వేసింది. అందుకే కిడ్నాప్​ అయినట్టు నేను చెప్పాను," అని పోలీసుల వద్ద నిజం చెప్పేసింది ఆ యువతి.

యువతి బ్యాగులో ఇండోర్​ నుంచి ఉజ్జెయిన్​ వెళ్లిన బస్సు టికెట్​, రెస్టారెంట్​ బిల్లును పోలీసులు పరిశీలించారు. అనంతరం ఓ మహిళా పోలీసు ఆమెకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఇలాంటి తప్పును మరోమారు రిపీట్​ చేయవద్దని సూచించారు. అనంతరం యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం