Army chopper crashes in Arunachal: కుప్పకూలిన మరో ఆర్మీ చాపర్-after army chopper crashes in arunachal 2 bodies found report
Telugu News  /  National International  /  After Army Chopper Crashes In Arunachal, 2 Bodies Found: Report
చాపర్ కుప్పకూలిన ప్రమాద దృశ్యం
చాపర్ కుప్పకూలిన ప్రమాద దృశ్యం

Army chopper crashes in Arunachal: కుప్పకూలిన మరో ఆర్మీ చాపర్

21 October 2022, 16:45 ISTHT Telugu Desk
21 October 2022, 16:45 IST

Army chopper crashes in Arunachal: ఆర్మీ హెలీకాప్టర్లు ప్రమాదవశాత్తూ కూలిపోతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా, హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మరో సైనిక హెలీకాప్టర్ కుప్పకూలింది.

Army chopper crashes in Arunachal: అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం ఉదయం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని రిమోట్ అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో, సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ చాపర్ లో మొత్తం ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

Army chopper crashes in Arunachal: రెండు మృతదేహాల వెలికితీత

ఈ హెలీకాప్టర్ శుక్రవారం ఉదయం లెకబలి వద్ద నుంచి బయల్దేరిందని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ట్యుటింగ్ కు దక్షిణంగా, ఎగువ సియాంగ్ జిల్లాలో దట్టమైన పర్వత, అటవీ ప్రాంతంలో ఈ Army chopper కుప్పకూలిందని వెల్లడించింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని తెలిపింది.

Army chopper crashes in Arunachal: విచారణ

ప్రమాదానికి కారణాలపై అంతర్గత విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. ఈ చాపర్ అడ్వాన్స్ డ్ లైట్ కంబాట్ హెలీకాప్టర్. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చాపర్ కూలిన ప్రాంతం నుంచి మంటలు, పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆయన ట్వీటర్ లో పోస్ట్ చేశారు. పక్షం రోజుల క్రితమే ఆర్మీ చాపర్ కుప్పకూలిన ఘటనలో ఒక పైలట్ చనిపోయిన విషయం తెలిసిందే.