Lalu slams Amit Shah | అమిత్ షా పై లాలు ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు
Lalu slams Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కు దిక్కు తోచడం లేదని, పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Lalu slams Amit Shah | బిహార్ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ నేతలపై చేసిన విమర్శలకు లాలు సమాధానమిచ్చారు. బీజేపీని బిహార్ లో లేకుండా చేశామని, 2024 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ అడ్రెస్ లేకుండా పోతుందని లాలు ప్రసాద్ వ్యాఖ్యానించారు.
Lalu slams Amit Shah | అమిత్ షా వ్యాఖ్యలు
బిహార్లోని పూర్నియాలో జరిగిన బహిరంగ సభలో శుక్రవారం అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిహార్ లో లాలు, నితీశ్ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని, త్వరలోనే వారిని తుడిచిపెట్టేస్తామని వ్యఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో, ఆ తరువాత వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ఖాయమని షా జోస్యం చెప్పారు. బిహార్ లో లాలు, నితీశ్ ల ఆటవిక పాలన చాన్నాళ్లు సాగబోదన్నారు.
Lalu slams Amit Shah | లాలు రిటార్ట్
అమిత్ షా వ్యాఖ్యలపై లాలు తీవ్రంగా స్పందించారు. బిహార్ లో అధికారం కోల్పోవడంతో అమిత్ షా దిక్కుతోచని స్థితిలో పడ్డారని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా, ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు. ఆటవిక పాలన తమది కాదని, గుజరాత్ లో ఉండగా, అమిత్ షా చేసిన పాలనే ఆటవిక పాలన అని విమర్శించారు.
Lalu slams Amit Shah | సోనియా తో భేటీ
లాలు ప్రసాద్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన బిహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి సోనియా నివాసానికి వెళ్తారు. ప్రతిపక్షం ఐక్యం కావడం కోసం కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా లాలు వ్యాఖ్యానించారు.