COVID-19: మూడు నెలల తరువాత మూడొందలు దాటిన కొత్త కోవిడ్ 19 కేసులు-after 97 days india records more than 300 fresh covid 19 cases ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  After 97 Days, India Records More Than 300 Fresh Covid-19 Cases

COVID-19: మూడు నెలల తరువాత మూడొందలు దాటిన కొత్త కోవిడ్ 19 కేసులు

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 02:20 PM IST

COVID-19 data: భారత్ లో కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల వివరాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

COVID-19: కేంద్ర వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. 97 రోజుల తరువాత తొలిసారి దేశంలో కొత్త కోవిడ్ 19 (COVID-19) కేసుల సంఖ్య 300 దాటింది.

ట్రెండింగ్ వార్తలు

COVID-19 cases: ఒక్క రోజులో 334 కేసులు..

కొరోనా (corona virus) మహమ్మారి గండం గడచిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ప్రతీసారి ఇంకా ఉన్నానంటూ కేసుల సంఖ్యలో పెరుగుదల ద్వారా గుర్తు చేస్తుంటుంది. అలాగే, తాజాగా, గురువారం మరోసారి అలాంటి ఝలక్ నే ఇచ్చింది. మూడు నెలల తరువాత దేశంలో కొరోనా కేసుల (corona cases) సంఖ్యలో స్వల్ప మెరుగుదల నమోదైంది. వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ లో శనివారం అప్ డేట్ చేసిన వివరాల ప్రకారం.. దేశంలో శుక్రవారం మొత్తం 334 కొత్త కోవిడ్ 19 (covid 19) కేసులు నమోదయ్యాయి. వాటిలో అధిక శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా యాక్టివ్ కొరోనా కేసుల సంఖ్య 2,686 కి చేరింది.

COVID-19 deaths: మరణాలు 3..

అలాగే, శుక్రవారం కోవిడ్ 19 తో ముగ్గురు చనిపోయారని వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ వెల్లడించింది. వారిలో ఇద్దరు మహారాష్ట్రలో, ఒకరు కేరళలో చనిపోయారు. మొత్తంగా దేశంలో కొరోనా (corona virus) రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. అలాగే, దేశవ్యాప్తంగా అధికారిక గణాంకాల ప్రకారం కొరోనా సోకిన వారి సంఖ్య 4,46,87,496 (4.46 కోట్లు) గా ఉంది. వారిలో 4,41,54,035 (4.41 కోట్లు) మంది కోవిడ్ 19 (covid 19) నుంచి కోలుకున్నారు. అలాగే, మొత్తం కొరోనా సోకినవారిలో మరణించిన వారి శాతం 1.19% గా ఉంది. ఇప్పటివరకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ (corona vaccination) లో భాగంగా, బూస్టర్ డోసులతో కలుపుకుని మొత్తం 220. 63 కోట్ల డోసుల కొరోనా టీకాను ఇచ్చారు.

IPL_Entry_Point

టాపిక్