Shraddha murder case: 10రోజుల క్రితమే చంపేందుకు ప్రయత్నించాడట.. కానీ!
Shraddha Walker murder case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. ఆమెను పాశవికంగా చంపిన అఫ్తాబ్ పునావాలా.. అంతకు ముందే ఈ దుశ్చర్యకు ప్రయత్నించాడన్న సమాచారం బయటికి వచ్చింది.
Shraddha Walker murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఎన్నో భయానక నిజాలు బయటికి వస్తున్నాయి. లివ్-ఇన్ పార్ట్ నర్‍గా ఉన్న శ్రద్ధను అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab Ameen Poonawala) అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గొంతు నులిమి చంపి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని ఢిల్లీలోని మెహ్రౌలీ అడవిలో పారేశాడు. అయితే హత్యకు 10 రోజుల ముందే శ్రద్ధను చంపేందుకు అఫ్తాబ్ ప్రయత్నించాడన్న విషయం తాజాగా బయటికి వచ్చింది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
తన లవర్ శ్రద్ధ వాకర్ ను హత్య చేసినట్టు ఢిల్లీ పోలీసుల విచారణలో అఫ్తాబ్ అమీన్ పునావాలా అంగీకరించాడు. మే 18వ తేదీన ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు చెప్పాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి మాయం చేసినట్టు వెల్లడించాడు. అయితే మే 18 కంటే సుమారు 10 రోజుల ముందే శ్రద్ధను గొంతునులిమి చంపేందుకు అఫ్తాబ్ ప్రయత్నించాడని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Shraddha murder case: గట్టిగా రోదించడటంతో..
“ఆ రోజు (హత్యకు 10 రోజుల మందు) శ్రద్ధ, అఫ్తాబ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అదే రోజే శ్రద్ధ గొంతును అతడు నులిమాడు. అయితే హఠాత్తుగా శ్రద్ధ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గట్టి ఏడ్చింది. దీంతో అప్పుడు అఫ్తాబ్ వెనక్కి తగ్గాడు” అని పోలీస్ వర్గాల నుంచి విషయం బయటికి వచ్చింది.
ఫోన్‍లో అఫ్తాబ్ వేరే మహిళలతో తరచూ మాట్లాడుతుండటంతో అతడు తనను మోసం చేస్తున్నాడని శ్రద్ధ భావించింది. ఆ విషయాన్ని అతడిని అడగటంతో తరచూ గొడవ పడుతుండే వాడని తెలిసింది. డేటింగ్ యాప్ బంబుల్‍లో పరిచయం ఏర్పడ్డాక సుమారు మూడు సంవత్సరాల పాటు శ్రద్ధ, అఫ్తాబ్ ప్రేమించుకుంటున్నారు. అయితే అఫ్తాబ్ క్రమంగా మారిపోతున్నాడని, తనను మోసం చేస్తున్నాడని శ్రద్ధ వేదనకు గురయ్యేదని సమాచారం.
Shraddha murder case: హత్య జరిగిన రోజు..
మే 18వ తేదీన అఫ్తాబ్, శ్రద్ధ మధ్య చిన్న విషయంలో గొడవ మొదలైందని తెలిసింది. ఇంటికి కావాల్సిన ఖర్చులు ఎవరు భరించాలన్న విషయంలో వాదన జరిగిందని సమాచారం. ఇది కాస్త పెద్దగా మారి ఇతర విషయాల్లోకి గొడవ వెళ్లింది. ముఖ్యంగా మోసం చేస్తున్నావంటూ అఫ్తాబ్‍ను శ్రద్ధ నిలదీసిందట.
ఈ ఏడాది మే 18వ తేదీన శ్రద్ధను అఫ్తాబ్ కిరాకతంగా హతమార్చాడు. ఆమె ఛాతిపై కూర్చొని గొంతు నిలిమి చంపాడు. ఆ తర్వాతి రోజే ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోశాడు. వెంటనే దగ్గర్లోని షాప్‍లో కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి అందులో నిల్వచేశాడు. కాగా, శ్రద్ధ తలను వేరుగా ఉంచి, అతడు ప్రతీ రోజు చూసేవాడన్న విస్తుగొలిపే నిజం బయటికి వచ్చింది. ఆ తర్వాత 18 రోజుల పాటు ప్రతీ రోజు ఆ శరీర భాగాలను అడవిలో పడేసేవాడట అఫ్తాబ్. మెహ్రౌలీ అడవికి అప్తాబ్‍ను పోలీసులు తీసుకెళ్లారు. కొన్ని భాగాలను పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ టెస్టుకు పంపారు.