Yogi Adityanath watches solar eclipse: సూర్య గ్రహణాన్ని వీక్షించిన యూపీ సీఎం-adityanath witnesses solar eclipse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Adityanath Witnesses Solar Eclipse

Yogi Adityanath watches solar eclipse: సూర్య గ్రహణాన్ని వీక్షించిన యూపీ సీఎం

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 10:17 PM IST

Yogi Adityanath watches solar eclipse: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మంగళవారం పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షించారు.

సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్
సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ (PTI)

Yogi Adityanath watches solar eclipse: ఉత్తర ప్రదేశ్ లో ఉన్న గోరఖ్ పూర్ లోని వీర్ బహదూర్ సింగ్ ప్లానెటోరియంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మంగళవారం సంభవించిన పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

Yogi Adityanath watches solar eclipse: ప్రత్యేక అద్దాలను ధరించి..

గోరఖ్ పూర్ లోని వీర్ బహదూర్ సింగ్ ప్లానెటోరియంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ టెలీస్కోప్ ద్వారా ప్రత్యేక కళ్లద్దాలు ధరించి సూర్య గ్రహణాన్ని చూశారు. గ్రహణం సమయంలో అంతరిక్షంలో చోటు చేసుకునే మార్పులు, గ్రహాల అమరికలో మార్పులు, గ్రహణం ప్రభావం, గ్రహణ సమయం మొదలైన విషయాలను ప్లానెటోరియంలోని సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. అంతరిక్షంలో మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయని, అవి తెలుసుకున్న కొద్దీ మానవ వికాసం జరుగుతూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Yogi Adityanath watches solar eclipse: ప్రజలకు సూచనలు..

ఈ సందర్భంగా ప్రజలకు యోగి ఆదిత్య నాథ్ పలు సూచనలు చేశారు. నేరుగా సూర్య గ్రహణం చూడవద్దని, పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ గ్రహణాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని చూడాలని సూచించారు. యూపీలోని ప్రధాన నగరాల్లో ప్రజలు సూర్య గ్రహణం చూడడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గోరఖ్ పూర్ లో మంగళవారం పాక్షిక సూర్య గ్రహణం దాదాపు 52 నిమిషాల పాటు కొనసాగింది.

IPL_Entry_Point