Adhir Ranjan big claim: ‘‘రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాద, లౌకిక పదాలను తొలగించారు’’- కాంగ్రెస్ ఆరోపణ
Adhir Ranjan big claim: పార్లమెంటు నూతన భవనంలోకి వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల పీఠికలో సామ్యవాద, లౌకిక (‘socialist’, ‘secular’) అనే పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు.
Adhir Ranjan big claim: నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే ముందు ఎంపీలకు అందజేసిన రాజ్యాంగం యొక్క కొత్త కాపీలలోని పీఠికలో 'సోషలిస్ట్ సెక్యులర్' అనే పదాలు లేవని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు
అనుమానంగా ఉంది..
ఇలా సామ్యవాద, లౌకిక పదాలను పీఠిక నుంచి తొలగించడం అనుమానాస్పదంగా ఉందని, కావాలనే ఇలా చేశారన్న అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలను రాజ్యాంగ పీఠిక (preamble) లో పొందుపర్చారు. అయితే, తాజాగా ఎంపీలకు ప్రభుత్వం అందజేసిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో ఆ రెండు ముఖ్యమైన పదాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. “వారి ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది. ఇది తెలివిగా జరిగింది. ఇది నాకు ఆందోళన కలిగించే అంశం. నేను ఈ సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నించాను, కానీ ఈ సమస్యను లేవనెత్తే అవకాశం నాకు లభించలేదు,” అని వ్యాఖ్యానించారు.
భగవద్గీత, ఖురాన్ లతో సమానం..
భారత రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర మత గ్రంధాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి వాటితో సమానమని ఆధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 లో ‘ఇండియా, దట్ ఈజ్ భారత్’ అని ఉందని, అందువల్ల ఆ రెండింటి మధ్య తేడా లేదని ఆయన వివరించారు. ఆ పేరుతో విబేధాలు సృష్టించే కార్యక్రమాలు చేపట్టవద్దని హితవు పలికారు.
పాత బిల్డింగ్ పేరు సంవిధాన్ సదన్
పాత పార్లమెంటు భవనాన్ని ఇకపై సంవిధాన్ సదన్ గా పిలవాలని స్పష్టం చేస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. కాగా, కొత్త భవనంలో మంగళవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. బుధవారం కొత్త భవనంలోనే మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చ ప్రారంభమైంది. ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ ల పర్యవేక్షణలో 1927 లో ఇప్పుడు సంవిధాన్ సదన్ గా మనం పేర్కొంటున్న పార్లమెంటు భవనం రూపొందింది. కొత్త నాలుగు అంతస్తుల త్రిభుజాకార సముదాయానికి 'పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా' అని పేరు పెట్టారు.