Adani Capital IPO : ఆదానీ గ్రూప్​ నుంచి మార్కెట్​లోకి మరో ఐపీఓ!-adani group plans adani capital ipo in 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Adani Group Plans Adani Capital Ipo In 2024

Adani Capital IPO : ఆదానీ గ్రూప్​ నుంచి మార్కెట్​లోకి మరో ఐపీఓ!

Sharath Chitturi HT Telugu
Jul 29, 2022 07:39 AM IST

Adani Capital IPO : అదానీ గ్రూప్​నకు చెందిన అదానీ క్యాపిటల్​ ఐపీఓగా మార్కెట్​లోకి రానుంది! 2024 తొలినాళ్లల్లో.. ఈ ఐపీఓను తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

ఆదానీ గ్రూప్​ నుంచి మార్కెట్​లోకి మరో ఐపీఓ!
ఆదానీ గ్రూప్​ నుంచి మార్కెట్​లోకి మరో ఐపీఓ! (REUTERS)

Adani Capital IPO news : అదానీ- విల్మర్​ తర్వాత.. అందానీ గ్రూప్​లోని మరో విభాగాన్ని ఐపీఓగా మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ఆసియాలోనే అపర కుబేరుడైన గౌతమ్​ అదానీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అదానీ గ్రూప్​నకు చెందిన ఎన్​బీఎఫ్​సీ విభాగం.. 'అదానీ క్యాపిటల్​'ను ఐపీఓగా తీసుకొచ్చి.. రూ. 1,500కోట్లను సమీకరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

10శాతం వాటా ఐపీఓకు వెళ్లే అవకాశం ఉందని అదానీ క్యాపిటల్​ సీఈఓ గౌరవ్​ గుప్తా వెల్లడించారు. దాని వాల్యుయేషన్​ 2బిలియన్​ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. 2024 తొలినాళ్లల్లో ఆదానీ క్యాపిటల్​ ఐపీఓ మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్​బర్గ తన నివేదికలో పేర్కొంది.

ఎనిమిది రాష్ట్రాల్లో.. అదానీ క్యాపిటల్​కు చెందిన 154 బ్రాంచీలు ఉన్నాయి. 60,000మంది రుణగ్రహీతలు ఉన్నారు. 30బిలియన్​ డాలర్ల రుణాలను అదానీ క్యాపిటల్​ నిర్వహిస్తోంది. సంస్థ ఎన్​పీఏ 1శాతంగా ఉంది. ఈ వివరాలను.. గౌరవ్​ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి యేటా.. లోన్​ బుక్​ను రెట్టింపు చేయడమే తన ప్రణాళిక అని అన్నారు.

2017 ఏప్రిల్​లో అదానీ గ్రూప్​.. అదానీ క్యాపిటల్​ ద్వారా.. ఎన్​బీఎఫ్​సీ విభాగంలోకి అడుగుపెట్టింది. రిటైల్​, గ్రామీణ ఆర్థికాల విభాగంపై దృష్టిపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలకు ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటుంది. ఎంఎస్​ఎంఈ వ్యాపారాలకు సైతం రుణాలు ఇస్తుంది.

ప్రస్తుతం గుజరాత్​, మహారాష్ట్ర, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో సంస్థకు చెందిన విస్తరణ ప్రణాళికలు అమల్లో ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్