NDTV acquisition by Adani: ఆదానీ గుప్పిట్లోకి ఎన్‌డీటీవీ!-adani forays into news channel space set to acquire ndtv ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Adani Forays Into News Channel Space; Set To Acquire Ndtv

NDTV acquisition by Adani: ఆదానీ గుప్పిట్లోకి ఎన్‌డీటీవీ!

Sudarshan Vaddanam HT Telugu
Aug 23, 2022 09:29 PM IST

భారతీయ సంప‌న్న వ్యాపారి గౌత‌మ్ ఆదానీ ప్ర‌ధాన మీడియా రంగంలోనూ అడుగుపెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తాజాగా ప్ర‌ముఖ జాతీయ వార్తాచానెల్ నెట్‌వ‌ర్క్ `ఎన్‌డీటీవీ`ని కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఎన్‌డీటీవీ లోగో
ఎన్‌డీటీవీ లోగో

ఎన్‌డీటీవీ(New Delhi Television Ltd - NDTV)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఆదానీ గ్రూప్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఆదానీ గ్రూప్ విస్త‌ర‌ణ వ్యూహంలో ఇది ప్ర‌ధాన‌మైన అడుగుగా భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NDTV acquisition by Adani: వ్యూహాత్మ‌కంగా..

NDTV కి 2008 -09లో రూ. 250 కోట్ల‌ను అప్పుగా ఇచ్చిన ఒక సంస్థ‌ను ఇప్ప‌టికే ఆదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఆ అప్పును New Delhi Television Ltd లో ఈక్విటీ గా మార్చుకుంటోంది. అలా ఎన్‌డీటీవీలో 29.18% వాటా ఆదానీ గ్రూప్ సొంత‌మ‌యింది. అదీ కాకుండా, ఎన్‌డీటీవీలో మ‌రో 26% వాటాను కొనుగోలు చేయ‌డానికి ఒక ఓపెన్ ఆఫ‌ర్‌ను కూడా ఇచ్చింది. ఆ ఆఫ‌ర్ స‌క్సెస్ అయితే, ఎన్‌డీటీవీలో మెజారిటీ షేర్ ఆదానీ సొంత‌మ‌వుతుంది. అయితే, ఆ రూ. 250 కోట్ల రుణాన్ని ఈక్విటీ గా మార్చుకునేందుకు ఎన్‌డీటీవీ షేర్ హోల్డ‌ర్ల అనుమ‌తి లేద‌ని ఎన్‌డీటీవీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 2008 -09లో ఎన్‌డీటీవీకి రూ. 250 కోట్లు అప్పుగా ఇచ్చిన సంస్థ మొద‌ట్లో రిల‌య‌న్స్ గ్రూప్‌లో భాగంగా ఉండ‌డం విశేషం.

NDTV acquisition by Adani: ఇదీ స్ట్రాటెజీ..

ఆదానీ గ్రూప్‌లో కీల‌కమైన‌ది ఆదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్‌(AEL). ఆ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఆదానీ మీడియా వెంచ‌ర్స్ లిమిటెడ్(AMVL) ఉంది. ఇది ఆదానీ గ్రూప్ మీడియా విభాగం. AMVL గ‌త సంవ‌త్స‌రం Quintillion Business Media Pvt Ltd (QBM)ను కొనుగోలు చేసింది. AMVL కు స‌బ్సిడ‌యిరీ సంస్థ VCPL(Vishvapradhan Commercial Pvt Ltd). ఈ VCPLను ఆదానీ గ్రూప్ రూ. 114 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఈ VCPLకు ఎన్‌డీటీవీ ప్ర‌మోట‌ర్ కంపెనీ అయిన RRPR Holding Pvt Ltd లో ప్ర‌స్తుతం దాదాపు 99% వాటా ఉంది. ఈ RRPR Holding Pvt Ltd కు ఎన్‌డీటీవీలో 29.18% వాటా ఉంది. అలా, VCPL ద్వారా ఎన్‌డీటీవీలో 29.18% వాటాను ఆదానీ గ్రూప్ పొందింది. ఈ 29.18% శాతానికి అద‌నంగా మరో 26% వాటా పొంద‌డానికి ఆదానీ గ్రూప్ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఆ ఆఫ‌ర్ విలువ రూ. 493 కోట్లు.

NDTV acquisition by Adani: ఎన్‌డీటీవీ నెట్‌వ‌ర్క్‌..

మ‌రోవైపు, ఎన్డీటీవీ నెట్‌వ‌ర్క్‌లో ఎన్‌డీటీవీ ఇంగ్లీష్‌, ఎన్‌డీటీవీ హిందీ వార్తా చానెళ్ల‌తో పాటు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ అనే బిజినెస్ న్యూస్ చానెల్ కూడా ఉంది. స్టాక్ మార్కెట్లో ఎన్‌డీటీవీ షేర్ విలువ మంగ‌ళ‌వారం రూ. 366.20గా ముగిసింది. ఈ సంవ‌త్స‌రం ఈ షేర్ విలువ దాదాపు 300 శాతం పెరిగింది. అయితే, ఓపెన్ ఆఫ‌ర్‌లో భాగంగా ఒక్కో షేరుకు రూ. 294 ధ‌ర‌తో 1.67 కోట్ల షేర్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆదానీ గ్రూప్ ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎన్‌డీటీవీలో రాధికా రాయ్, ప్ర‌ణ‌య్ రాయ్ ప్ర‌ధాన ప్ర‌మోట‌ర్లుగా ఉన్నారు. వారికి వ్య‌క్తిగ‌తంగా, అలాగే, త‌మ‌ RRPR Holding Pvt Ltd సంస్థ ద్వారా ఎన్‌డీటీవీలో 61.45% వాటా ఉంది.

NDTV acquisition by Adani: అంబానీకి ఆల్రెడీ ఉన్నాయి..

ఇప్ప‌టికే మీడియా రంగంలో ముకేశ్ అంబానీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయ‌న గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌స్తుతం Network18 ఉంది. ఇందులో CNN-News18, బిజినెస్ చానెల్‌ CNBC-TV18 త‌దిత‌ర చానెళ్లు ఉన్నాయి.

IPL_Entry_Point