Adam Britton jail : అమానవీయ, క్రూరమైన ఘటనలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ జువాలజిస్ట్, బ్రిటీష్ దేశస్థుడు ఆడమ్ బ్రిట్టన్కి ఆస్ట్రేలియా కోర్టులో కఠిన శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తోంది. 42 శునకాలను రేప్ చేయడం, వాటిల్లో 39 జంతువులను చంపడం వంటి నేరాలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకి కనీసం 249ఏళ్ల జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి.
జంతు- మొసళ్ల నిపుణుడిగా గుర్తింపు ఉన్న ఆడమ్ బ్రిట్టన్.. నేరాలు చేయడమే కాదు, వాటిని చిత్రీకరించి ఆన్లైన్లో కూడా పోస్ట్ చేసేవాడు. ఫలితంగా అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 40కిపైగా శునకాల రేప్, హత్య నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆయనపై కేసులు ఉన్నాయి. జంతు క్రూరత్వానికి సంబంధించిన 60 కేసుల్లో గతేడాది అతను దోషిగా తేలాడు.
ఆడమ్ బ్రిట్టన్ కేసులపై గత గురువారం ఆస్ట్రేలియాలోని నార్తెన్ టెరిటరీ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ముందు తన సిబ్బందిని, జంతు హక్కుల కార్యకర్తలను బయటకు పంపించారు జస్టిస్ మైకెల్ గ్రాంట్. అనంతరం బ్రిట్టన్కి సంబంధించిన వీడియోని చూశారు.
"ఈ మెటీరీయల్ ఎవరు చూసినా వాళ్లు షాక్ అవుతారు. సైకలాజికల్‌గా దెబ్బతింటారు," అని స్వయంగా జడ్జి మైకెల్ గ్రాంట్.
ఈ వ్యవహారంపై గురువారమే తుది తీర్పు వస్తుందని, ఆడమ్ బ్రిట్టన్కి కనీసం 249ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అందరు భావించారు. కానీ అతని తరఫు న్యాయవాదు ఒక కొత్త రిపోర్టు జడ్జి ముందు పెట్టి, దానిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఆ రిపోర్టు సైకాలజిస్ట్ ట్రీట్మెంట్ అనంతరం జైలులో ఉన్న బ్రిట్టన్ మానసిక పరిస్థితి అని తెలుస్తోంది.
"పశ్చ్యాతాపం అనేది రీహాబిలేషన్కు అవకాశాలుగా పరిగణించవచ్చు. ప్రొఫెషనల్స్‌తో మాట్లాడిన మొదటిసారే పశ్చ్యాతాపం కనిపించకపోవచ్చు. పలుమార్లు చికిత్స ఇచ్చిన తర్వాత అవి కనిపిస్తాయి. నా క్లైంట్ జైలు శిక్షని తగ్గించాలని మానవి చేస్తున్నాను. చాలా చిన్న వయస్సు నుంచే అతని మానసిక స్థితి బాగోలేదు. అది అతని తప్పు కాదు. దీనిని కోర్టు పరిగణిస్తుందని ఆశిస్తున్నాను," అని బ్రిట్టన్ తరఫు న్యాయవాది వాదించారు.
ఆడమ్ బ్రిట్టన్ కేసులపై ఆస్ట్రేలియా కోర్టు ఆగస్టులో విచారించనుంది. అప్పుడే తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
పలు రిపోర్టుల ప్రకారం ఆస్ట్రేలియా డార్విన్‌లో నివాసమున్న ఆడమ్ బ్రిట్టన్ అనేక శునకాలను కొట్టి చంపేశాడు. వాటిని రికార్డు కూడా చేశాడు. అంతేకాదు అతడి వద్ద ఒక 'టార్చర్ రూమ్' ఉండేదని, అది ఒక షిప్పింగ్ కంటైనర్ అని, దానిలో శునకాలపై లైంగిక దాడికి పాల్పడే వాడని సమాచారం.
సంబంధిత కథనం