ADA recruitment 2023: ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్; బెంగళూరులో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్
ADA recruitment 2023: ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (Aeronautical Development Agency ADA) ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. వివిధ బ్రాంచ్ ల్లో ఇంజనీర్లను భర్తీ చేసుకోవడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఇంటర్వ్యూలు బెంగళూరులో జరగనున్నాయి.
ADA recruitment 2023: బెంగళూరు కేంద్రంగా ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (Aeronautical Development Agency ADA) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 (Project Assistant-1 in ADA ) ఇంజనీర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 100 మంది ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ ను రిక్రూట్ చేసుకోనుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూస్
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ (walk-in interviews) కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 14 తేదీల్లో జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.ada.gov.in. వెబ్ సైట్ లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎక్కడ?
ఆసక్టి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 14 తేదీల్లో కింద పేర్కొన్న అడ్రస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కు హాజరు కావచ్చు.
ఏడీఏ క్యాంపస్ 2; సురంజన్ దాస్ రోడ్, న్యూ తిప్పసంద్ర, బెంగళూరు - 560 075
ఈ అడ్రస్ కు పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 8.30 గంటల నుంచి 11.00 గంటల వరకు చేరుకున్న అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత వచ్చిన అభ్యర్థులను అనుమతించరు. ఉదయం 8.30 గంటల నుంచి 11.00 గంటల వరకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ వెరిపికేషన్ ఉంటుంది. ఆ తరువాత వాక్ ఇన్ ఇంటర్వూస్ ఉంటాయి.
age limit: వయో పరిమితి
ఈ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపులు ఉంటాయి.
వేకెన్సీ వివరాలు..
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 100 మంది ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ ను ఏడీఏ రిక్రూట్ చేసుకోనుంది. వీరిలో..
- మెకానికల్/ ప్రొడక్షన్/ మెటలర్జికల్/ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - 23 పోస్ట్ లు
- సివిల్ ఇంజనీరింగ్ - 2 పోస్ట్ లు
- కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫోటెక్/ ఇన్ఫో సైన్స్ - 25 పోస్ట్ లు
- ఏరోనాటికల్/ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ - 2 పోస్ట్ లు
- ఎలక్ట్రానిక్స్/ ఎఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ టెలీ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ - 48 పోస్ట్ లు.