Actor road accident : ప్రముఖ నటికి రోడ్డు ప్రమాదం.. వెంటిలేటర్‌పై చికిత్స!
Arundhathi Nair accident : ప్రముఖ నటి అరుంధతి నాయర్.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం.
Arundhathi Nair accident news : ప్రముఖ తమిళ, మలయాళీ నటి అరుంధతి నాయర్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలను ఆమె సోదరి ఆరతి.. ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా ప్రకటించారు.
'ఆమె తీవ్రంగా గాయపడింది' అని
మార్చ్ 14న.. అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన సోదరి.. మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైందని, పరిస్థితి విషమంగా ఉందని.. అరుంధతిని ట్యాగ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు ఆరతి.
Arundhathi Nair latest news : 'తమిళనాడు వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము భావించాం. తన సోదరి అరుంధతి నాయర్‌కు మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. ఆమె తీవ్రంగా గాయపడి తిరువనంతపురంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఆమె కోలుకోవడానికి మీ ప్రార్థనలు, మద్దతు మాకు కావాలి,' అని క్యాప్షన్ ఇచ్చారు.
కోవలం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని, అరుంధతి తలకు గాయాలయ్యాయని ఇండియా టుడే తెలిపింది. అరుంధతి నాయర్ తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Arundhathi Nair accident updates : ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. అరుంధతి నాయర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తామని నెటిజన్లు చెబుతున్నారు. “ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మేము ప్రార్థిస్తున్నాము,' అని ఓ అభిమాని కామెంట్ చేయగా, 'అయ్యో ఇది చూసి చాలా బాధగా ఉంది. ఆమె త్వరగా కోలుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను”, అని మరొకరు రాసుకొచ్చారు.
అరుంధతి నాయర్..
అరుంధతి నాయర్.. 2014లో తమిళ చిత్రం పొంగి ఏడు మనోహరతో తెరంగేట్రం చేశారు. సైతాన్, పిస్తా వంటి చిత్రాల్లో నటించారు. 2018లో ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టిన ఆమె షైన్ టామ్ చాకోతో కలిసి 2023లో వచ్చిన ఆయిరం పోర్కాసుకల్ చిత్రంలో చివరిసారిగా నటించారు. 2019-20 మధ్య కేరళ సమాజం అనే మలయాళ టీవీ షోలో నటించారు. 2021లో మలయాళ వెబ్ సిరీస్ పద్మిని, డోంట్ థింక్ అనే తమిళ సీరియల్లో నటించారు.
సంబంధిత కథనం