German shepherd : పాపం మూగ జీవి! వదిలేసి వెళ్లిపోయిన ఓనర్ కోసం 8 గంటలు..
దిల్లీలోని ఓ రద్దీ మార్కెట్లో ఓ జర్మన్ షెపర్డ్ శునకాన్న, దాని యజమాని వదిలేసి వెళ్లిపోయారు. ఆ జర్మన్ షెపర్డ్ తన యజమాని కోసం 8 గంటల పాటు ఎదురుచూసింది!
దేశ రాజధాని దిల్లీలోని ఒక రద్దీ మార్కెట్లో జరిగిన ఒక సంఘటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వదిలెసి వెళ్లిపోయిన ఓనర్ కోసం ఒక పెంపుడు శునకం 8 గంటల పాటు ఎదురుచూసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ దృశ్యాలు జంతు ప్రేమికులను కదిలిస్తున్నాయి.

ఇదీ జరిగింది..
అజయ్ జో అనే వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. పార్క్ చేసిన స్కూటర్‌పై జర్మన్ షెపర్డ్ కూర్చున్న వీడియోను జో జనవరి 14న పంచుకున్నాడు.
ఆ కుక్కను దిల్లీ మార్కెట్ లో వదిలేశారని, దాని యజమాని తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నట్లు జో వెల్లడించాడు.
"ఈ సాయంత్రం, ఒక కుక్కను స్కూటర్‌పై దిల్లీలోని మార్కెట్‌కు తీసుకువచ్చారు. వదిలేసి వెళ్లిపోయారు. ఆ కుక్క మరో స్కూటర్ ఎక్కి తన యజమాని కోసం గత 8 గంటలుగా ఎదురుచూస్తోంది. తనను వదిలివెళ్లిన వ్యక్తి కోసం వెతుకుతూ చుట్టూ చూస్తున్నప్పుడు శునకం కళ్లు ఆశ, నిరాశతో నిండి ఉన్నాయి," అని అతను ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
కుక్కని గమనించిన జంతు ప్రేమికులు ఆమెను రక్షించడానికి ప్లాన్ చేశారు. ఒక వాలంటీర్ తెల్లవారుజామున 3 గంటల వరకు జర్మన్ షెపర్డ్ తో ఉండి, దానికి మంచి ఆహారం, సంరక్షణ ఉండేలా చూసుకున్నాడు. రేణు ఖించి అనే మరో వ్యక్తి కుక్కను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ కోసం ఏర్పాట్లు చేశాడు.
జర్మన్ షెపర్డ్‌కు స్విగ్గీ అని నామకరణం!
దిల్లీ మార్కెట్లో ఒంటరిగా ఉండిపోయిన జర్మన్ షెపర్డ్‌ని జంతు రక్షకురాలు, సోఫీ మెమోరియల్ యానిమల్ రిలీఫ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కావేరి రాణా రక్షించారు. రెస్క్యూ తర్వాత అది ఆడ కుక్క అని, కానీ సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరించారని వెల్లడైంది.
"రాత్రంతా శునకాన్ని రక్షించడానికి, ఆమె భద్రతను నిర్ధారించడానికి మేము చేసిన ప్రయత్నాల్లో, మేము కుక్క లింగాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అంకితభావం కలిగిన వాలంటీర్ల నిరంతర నిఘా ఆమెను వీధుల్లో సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించింది," అని జో తన తదుపరి పోస్ట్‌లో పేర్కొన్నారు.
తప్పిపోయిన పెంపుడు జంతువులను తమ యజమానుల వద్దకు చేర్చోంది ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. అందుకు గౌరవసూచికగా, ఈ జర్మన్ షెపర్డ్‌కి స్విగ్గీ అని పేరు పెట్టడం జరిగింది.
మరోవైపు తమ పెంపుడు జంతువులను వదిలేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోతో పాటు వందలాది మంది సోషల్ మీడియా యూజర్లు ఏకమయ్యారు.
“పెంపుడు జంతువును విడిచిపెట్టడం మానవుడు చేయగలిగే అత్యంత హృదయరహిత, క్రూరమైన చర్యలలో ఒకటి. పెంపుడు జంతువులు సంరక్షణ, ప్రేమ కోసం మనపై ఆధారపడతాయి. వారిని విడిచిపెట్టడం వారి నమ్మకాన్ని, విశ్వసనీయతకు ద్రోహం చేయడమే,” అని జో రాసుకొచ్చాడు.
"వేచి ఉన్న ఇంత నమ్మకమైన కుక్కను విడిచిపెట్టిన దుష్ట మానవుడికి శాపం తగలాలి!" అని మరొకరు రాసుకొచ్చారు.
సంబంధిత కథనం