'Modi Hatao Desh Bachao': 11 భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్లు-aap releases modi hatao desh bachao posters in 11 languages
Telugu News  /  National International  /  Aap Releases 'Modi Hatao Desh Bachao' Posters In 11 Languages
‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్ తో ఆప్ నేతలు
‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్ తో ఆప్ నేతలు

'Modi Hatao Desh Bachao': 11 భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్లు

28 March 2023, 14:14 ISTHT Telugu Desk
28 March 2023, 14:14 IST

'Modi Hatao Desh Bachao': ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi)పై పోరాటాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party AAP) తీవ్రం చేసింది. దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగించడానికి వీలుగా మొత్తం 11 భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్లను ముద్రించింది.

'Modi Hatao Desh Bachao': ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party AAP) ప్రధాని మోదీ పై 11 భాషల్లో పోస్టర్లను రూపొందించింది. ‘మోదీ హఠావో.. దేశ్ బచావో (Modi Hatao Desh Bachao)’ నినాదంతో రూపొందిన ఆ పోస్టర్లను ఢిల్లీలో మంగళవారం విడుదల చేసింది.

'Modi Hatao Desh Bachao': తెలుగు, మలయాళం సహా..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో ఈ ‘మోదీ హఠావో.. దేశ్ బచావో (Modi Hatao Desh Bachao)’ పోస్టర్లను ఆప్ రూపొందించింది. మార్చి 23న ఢిల్లీలోని జంతర మంతర్ లో ఆప్ (AAP) భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్(ఢిల్లీ), భగవంత్ మన్(పంజాబ్) పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో (Modi Hatao Desh Bachao)’ పోస్టర్లను మార్చి 30న అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అతికిస్తామని ఇదే సభలో ఆప్ నేత గోపాల్ రాయ్ ప్రకటించారు. మరోవైపు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కూడా ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ‘కేజ్రీవాల్ హఠావో.. దేశ్ బచావో (Kejriwal Hatao Desh Bachao)’ అనే ఆ పోస్టర్లను ఢిల్లీ నగర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో అతికించారు.

'Modi Hatao Desh Bachao': 100కు పైగా ఎఫ్ ఐఆర్ లు

ప్రధాని మోదీపై అభ్యంతరకర రీతిలో పోస్టర్లను ప్రచురించి, ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీలో 100కు పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదయ్యాయని, ఆరుగురిని అరెస్ట్ చేశామని ఢిల్లీ స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. ఆప్ కార్యాలయం నుంచి ఈ పోస్టర్లతో బయటకు వచ్చిన ట్రక్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పోస్టర్ల వివాదంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ (PM Modi) ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? ఎందుకింత అభద్రతతో ఉన్నారు? ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పోస్టర్లు సాధారణమే కదా’’ అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సన్నిహితుడు, ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన నాటి నుంచి ఆప్ (AAP), బీజేపీ (BJP) ల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది.